IND VS BAN Test Match : మూడు పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు.. భారత బౌలర్ల సంచలనం.. మలుపులు తిరుగుతున్న కాన్పూర్ టెస్టు

కాన్పూర్ టెస్టు రసవత్తర మలుపులు తిరుగుతోంది.. సోమవారం 26/2 వద్ద రెండవ ఇన్నింగ్స్ ముగించిన బంగ్లాదేశ్ జట్టు.. మంగళవారం తిరిగి ఆటను ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో మాదిరిగానే రెండవ ఇన్నింగ్స్ లోనూ భారత బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 11:57 am

IND VS BAN Test Match

Follow us on

IND VS BAN Test Match :  23/2 వద్ద రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు మరో 13 పరుగులు జత చేసి మోమినుల్ హక్ క్రికెట్ కోల్పోయింది. 8 బంతులు ఎదుర్కొన్న మోమినుల్ హక్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో బంగ్లాదేశ్ భారత బౌలర్ల ఎదుట దాసోహం అవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.. అయితే ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం(50: 101 బంతుల్లో 10 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ శాంటో(19: 37 బంతుల్లో రెండు ఫోర్లు) నాలుగో వికెట్ కు 55 పరుగులు జోడించారు. వారిద్దరూ కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో.. రవీంద్ర జడేజా అద్భుతమైన బంతివేసి శాంటో ను అవుట్ చేశాడు.. జడేజా వేసిన బంతిని అంచనా వేయలేక శాంటో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 50 పరుగులు చేసిన షాద్మాన్ ఇస్లాం కూడా ఆకాష్ దీప్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇస్లాం అవుట్ అయిన తర్వాత లిటన్ దాస్ క్రీజ్ లోకి వచ్చాడు.. అతడు కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేశాడు.. రవీంద్ర జడేజా మ్యాజికల్ డెలివరీకి కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. షకీబ్ అల్ హసన్ కూడా పరుగులేమీ చేయకుండానే జడేజా చేతిలో క్యాచ్ అండ్ బౌల్డ్ గా వెనుతిరిగాడు.

మూడు పరుగుల వ్యవధిలోనే..

ఒకానొక దశలో బంగ్లా జట్టు 90/3 వద్ద పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ జట్టు స్కోరు 91 పరుగులకు చేరుకోగానే రవీంద్ర జడేజా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి కెప్టెన్ శాంటో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. జడేజా వేసిన డెలివరీ శాంటో వికెట్లను పడగొట్టింది. అప్పటికి బంగ్లా స్కోరు 91 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత అర్ధ సెంచరీ చేసి సౌకర్యవంతంగా కనిపించిన ఇస్లాం ఆకాశ్ దీప్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లిటన్ దాస్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన షకీబ్ అల్ హసన్ రవీంద్ర జడేజా చేతిలో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఇలా బంగ్లాదేశ్ జట్టు కేవలం మూడు పరుగుల వ్యవధిలోనే నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోవడం భారత జట్టులో ఉత్సాహాన్ని రేకెత్తించింది.. ప్రస్తుతం బంగ్లాదేశ్ 113/7 వద్ద నిలిచింది. క్రీజ్ లో ముష్ఫికర్ రహీం (10), హసన్ మిరాజ్ (9) కొనసాగుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆకాష్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ 62 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.

&