Rohit Sharma-Virat Kohli : బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే వీరిద్దరి టెస్ట్ కెరియర్ చివరి దశలో ఉంది. ఒకవేళ ఈ సిరీస్లో వీరిద్దరూ మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తే.. భారత జట్టుకు ట్రోఫీ దక్కేది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆడేందుకు అవకాశం ఉండేది. గత రెండు సీజన్లో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో.. రెండవసారి ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. ముచ్చటగా మూడోసారి ఫైనల్స్ వెళ్లి తొలిసారి ట్రోఫీ దక్కించుకోవాలని భావించింది. కానీ టీమిండియా ఆశలు నెరవేరే విధంగా కనిపించడం లేదు. ఇటీవల స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టు లో గెలిచినప్పటికీ.. అడిలైడ్ లో ఓడిపోయింది. బ్రిస్ బేన్ లో వర్షం వల్ల బతికిపోయింది. ఇప్పుడు మెల్ బోర్న్ లో ఎదురీదుతోంది. పెర్త్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. చాలా సంవత్సరాల తర్వాత అతడు ఈ ఘనత అందుకున్నాడు. కానీ దానిని మిగతా మ్యాచ్లలో కొనసాగించలేకపోయాడు. రోహిత్ అడిలైడ్ టెస్ట్ ద్వారా జట్టులోకి వచ్చాడు. కానీ ఇంతవరకు ఒక్క గొప్ప ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. దాదాపు 7 ఇన్నింగ్స్ లలో అతడి హైయెస్ట్ స్కోర్ పదిపరుగులు అంటే.. ఎంత దారుణంగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
రిటైర్మెంట్ తీసుకోండి
మెల్ బోర్న్ సెకండ్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 9 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేయగా.. రెండవ ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ దారుణమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న ఈ ఇద్దరు ఆటగాళ్లపై టీమ్ ఇండియా అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.. సమయం మించిపోక ముందే రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. #happy retirement అనే యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు..” ఇక మీరు ఆడే అవకాశం లేదు. కొత్త వాళ్లకు అవకాశాలు కల్పించే విధానానికి స్వాగతం పలకండి. టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకండి. ఇలా ఆడితే మీ పరువే కాదు, జట్టు పరువు కూడా పోతుంది. ఇప్పటివరకు టీమిండియా పరువు పోయిన కాడికి చాలు. ఇలానే ఆడి ఇంకా తీయకండి అంటూ..” టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Elon Musk changed the Like Button for Virat Kohli & Rohit – The Goat l.
Happy Retirement Rohit and Kohli #INDvsAUS #AUSvINDIA #RohitSharma #ViratKohli #JaspritBumrah Sara #flightcrash Jaiswal #MannKiBaat Sunil Gavaskar #zelena pic.twitter.com/EQYA8LPrir
— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 30, 2024