World Test Championship : జూన్ 11 నుంచి జూన్ 15 మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. జూన్ 16 ను రిజర్వ్ డే గా ప్రకటించింది.. వచ్చే వచ్చే ఏడాది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా ఇంగ్లాండులోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరగనుంది. దీంతో వరుసగా మూడోసారి కూడా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నిర్వహించే ఘనతను ఇంగ్లాండు దక్కించుకుంది. ఇప్పటివరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లు 2021లో సౌతాంప్టన్, 2023లో ఓవల్ లో జరిగాయి. 2021 లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. 2023 ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏకంగా 229 రన్స్ తేడాతో భారత్ ను మట్టి కరిపించింది. “త్వరలోనే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నిర్వహిస్తాం. ఈ టోర్నని నిర్వహించేందుకు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. వచ్చే ఏడాది కూడా సిరీస్ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం.. వేదికను, తేదీలను కూడా ప్రకటించాం. ఏ జట్లు ఫైనల్ లో ప్రవేశిస్తాయో చూడాల్సి ఉందని” ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ పేర్కొన్నాడు.
ఇక ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను పరిశీలనకు తీసుకుంటే భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.. ఈ రెండు జట్లు త్వరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ ల సిరీస్ ఆడునున్నాయి.. భారత్, ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లున్నాయి
గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. అంతకుముందు జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో విజయం సాధించాలని..టెస్ట్ క్రికెట్ గదను దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ క్రికెట్ పాయింట్ల జాబితాలో రోహిత్ సేన మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా రెండవ స్థానం లో ఉంది. ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. పాక్ పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను సాధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్ నాలుగవ స్థానానికి చేరుకుంది.. బంగ్లాదేశ్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ప్రస్తుతం అత్యుత్తమ ర్యాంకును సాధించింది. త్వరలో భారత జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.