Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునే విధంగా ఉన్నాయి. దానివల్లనే అంచనాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మొదట ‘ఫియర్ సాంగ్”, ఆ తర్వాత ‘చుట్టమల్లే సాంగ్’ రిలీజ్ అయ్యాయి. అయితే రెండు సాంగ్స్ లకు కూడా మొదట నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సాంగ్స్ వినుకుంటూ ఉంటే మాత్రం స్లో పాయిజన్ లా చాలా నిదానంగా జనాలకు ఎక్కుతున్నాయి. ఇప్పటికే చుట్ట మల్లే సాంగ్ అత్యధికంగా వ్యూయర్ షిప్ ను సాధించిన సాంగ్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక దానికి తోడుగా ఈరోజు సాయంత్రం 5 : 04 నిమిషాలకి థర్డ్ సింగిల్ గా ‘దావుడి దేవర’ అనే లిరికల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సాంగ్ తో సినిమా ఎలాంటి మ్యాజిక్ చేయబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి సంచలనం గా మారిబోతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇంతకుముందు వచ్చిన రెండు సాంగ్స్ సపరేట్ క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు రాబోయే సాంగ్ సినిమాకి చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాలో ఈ సాంగ్ చాలా ఇంపార్టెంట్ సన్నివేశంలో రాబోతుందని కూడా మేకర్స్ తెలియజేస్తున్నారు. ఇక ఇదంతా బాగానే ఉంది. కానీ అనిరుధ్ ఈ పాటని చాట్ బస్టర్ గా నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే రెండు సాంగ్స్ నెగటివ్ టాక్ ని తెచ్చుకొని నిదానంగా పాజిటివ్ గా మారుతున్నాయి. కానీ ఈ సాంగ్ మాత్రం ఫస్ట్ వినడంతోనే పాజిటివ్ వైబ్రేషన్ ని తీసుకురావాలి అలా అయితేనే సినిమా మీద అంచనాలు భారీగా పెరుగుతాయి.
లేకపోతే మాత్రం మళ్ళీ సినిమా మీద అంచనాలు భారీగా తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపద్యంలో తొందర్లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా దేవర థర్డ్ సింగిల్ మీదనే అందరి ఫోకస్ అయితే ఉంది. మరి ఈ సాంగ్ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది.
ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని ఎన్టీఆర్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…