Cricket : క్రికెటర్లను డెమీ గాడ్స్ గా పేర్కొనడం మన దేశ ప్రజలకు చాలా సంవత్సరాల నుంచి అలవాటుగా మారింది. అందువల్లే సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ గా సంబోధిస్తున్నారు. అతడి ఆటను.. అతని మాటను ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. ఇక నవీన కాలంలో అయితే మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి వారు సరికొత్త ఫ్యాన్ బేస్ తో ఆకట్టుకుంటున్నారు. ఇండియాలో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది కాబట్టే ఐపీఎల్ లాంటి టోర్నీలు పుట్టుకొచ్చాయి. ఇక వచ్చే రోజుల్లో క్రికెట్ ఎలాంటి మార్పులకు గురవుతుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే వేలకోట్ల వ్యాపారం లాగా మారిపోయింది. క్రికెట్ ను కెరీయర్ గా ఎంచుకున్న చాలామంది సెలబ్రిటీలుగా మారిపోయారు. వందల కోట్ల ఆస్తులను సంపాదించారు. అంతకంతకు బిజినెస్ పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కూడా విరివిగా మైదానాలు నిర్మిస్తోంది. బెంగళూరులో అయితే ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నేషనల్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసింది. అయితే అటువంటి మనదేశంలో క్రికెట్ ను ప్రొఫెషనల్ గానే కాకుండా.. సరదాగా ఆడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి జాబితాలో వీళ్లు కూడా ఉన్నారు. అయితే వీరు ఆడిన క్రికెట్ మాత్రం పొట్ట చెక్కలయ్యేలా చేస్తోంది. పడి పడి నువ్వేలా చేస్తోంది.
ఏం ఫీల్డింగ్ రా బాబూ
సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్న వీడియోలో.. కొందరు వ్యక్తులు క్రికెట్ ఆడుతున్నారు. అందులో ఒకతను గల్లీ క్రికెట్ లో మాదిరిగా బౌలింగ్ చేశాడు. స్ట్రైకర్ గా ఉన్న వ్యక్తి బంతిని గట్టిగా కొట్టాడు. అది స్లిప్ నుంచి పైకి లేచి కింద పడింది.. అదే పొజిషన్లో ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తి బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే ఆ బంతి వెంట పరుగు తీసి ఒక్కసారిగా కిందపడ్డాడు. ఆ తర్వాత తన కాలితో ఆ బంతిని ఆపడానికి ప్రయత్నించి.. బౌండరీ దాటించాడు. ఎంతో ప్రయాసపడినప్పటికీ బంతిని ఆపలేకపోవడంతో అతడు అలానే మైదానంలో పడుకుని ఉండిపోయాడు. దీనిని ఎవరు తీశారో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాలలో సందడిగా మారింది. ” మీరు క్రికెట్ ఆడుతున్నారు. కర్రా బిల్లా కాదు.. ఇలా క్రికెట్ ఆడితే.. దానిని చూస్తున్న వారి పరిస్థితి ఏంటి… నవ్వి నవ్వి కిందపడి చచ్చిపోతే ఎవరు గ్యారంటీ” అని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాలక్షేపం కోసం క్రికెట్ ఆడుతున్న వీరు.. కామెడిని కూడా చేశారని.. వారు వివరిస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనమిస్తోంది.
This video is truly priceless
— Sukhada (@appadappajappa) December 30, 2024