Viral video : ఆటగాళ్లు అలసిపోతే.. కోచ్ వచ్చి ఫీల్డింగ్ చేశాడు..క్రికెట్ లో ఎన్నడూ చూడని విడ్డూరం ఇది.. వీడియో వైరల్

క్రికెట్ లో ఎన్నో సంచలనాలు చోటు చేసుకుంటాయి. మరెన్నో అద్భుతాలు జరుగుతాయి. అయితే తొలిసారిగా క్రికెట్ గ్రౌండ్ లో ఆశ్చర్యం చోటుచేసుకుంది. ఇది ప్రపంచాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By: Anabothula Bhaskar, Updated On : October 8, 2024 11:57 am

Viral video

Follow us on

Viral video :  అబుదాబి షేక్ జాయేద్ మైదానంలో దక్షిణాఫ్రికా – ఐర్లాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కొనసాగుతోంది.. అంతకుముందు రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ జరగగా.. తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ పదిపరుగుల తేడాతో గెలిచింది. మూడో వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 139 రన్స్ తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. రెండవ వన్డే లోనూ దక్షిణాఫ్రికా 174 రన్స్ తేడాతో విజయ దుందుభి మోగించింది. ఇక మూడో వన్డేలో ఐర్లాండ్ 69 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. మొత్తానికి సిరీస్ 2-1 తేడాతో దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. అయితే సోమవారం రాత్రి జరిగిన నామమాత్రమైన మూడో వన్డేలో ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 రన్స్ చేసింది. కెప్టెన్ స్టిర్లింగ్ (88), హ్యారి టెక్టర్(60), బాల్ బిర్ణి(45) టాప్ స్కోరర్ లు గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బార్ట్ మాన్, ఫెహ్లూ క్వాయో తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు.. అనంతరం 285 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 46.1 ఓవర్లలో 215 పరుగులకు కుప్ప కూలింది. జాసన్ స్మిత్ (91), కైల్(38) టాప్ స్కోరర్లు గా నిలిచారు..యంగ్, హ్యూమ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. మార్క్ అడైర్ రెండు వికెట్లు సాధించాడు.

డుమిని వచ్చాడు

ఈ మ్యాచ్ డే/ నైట్ లో జరిగినప్పటికీ.. అధికంగా ఉక్కపోత, వేడి వల్ల దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేయడంలో ఆపసోపాలు ఎదుర్కొన్నారు.. చెమట తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చాలామంది ఆటగాళ్లు డిహైడ్రేషన్ కు గురయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా కోచ్ డుమిని మైదానంలోకి దిగాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్ల తరఫున ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.. దీనికి సంబంధించిన దృశ్యాలు/ వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ” దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యూఏఈ లో వేడి అధికంగానే ఉంటుంది. ఆ వేడిని వారు తట్టుకోలేకపోతున్నారు. అందువల్లే డుమిని మైదానంలోకి వచ్చాడని” నెటిజన్లు పేర్కొంటున్నారు.