https://oktelugu.com/

Chennai Team : అందరూ పంత్ అని అనుకుంటున్నారు.. చెన్నై జట్టు కాసుల వర్షం కురిపించాలనుకుంటున్నది అతనిపైనేనట..

కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి మెగా వేలానికి తేదీ ఫిక్స్ అయింది. నవంబర్ 24, 25 తేదీలలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సౌదీలోని జెడ్డా వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 10, 2024 / 12:55 PM IST

    Chennai Team

    Follow us on

    Chennai Team :  వేలం నేపథ్యంలో ఎవరిని దక్కించుకోవాలనే విషయంపై జట్లు కసరత్తు ప్రారంభించాయి. అయితే ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. 65 కోట్లతో ఇప్పటికే ధోని సహా ఐదుగురు ఆటగాళ్లను చెన్నై జట్టు తీసుకుంది. ఇకమీద ఆటగాళ్ల కోసం 55 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో ఏడుగురు విదేశీ ఆటగాళ్లను చెన్నై కొనుగోలు చేయాలి.. వచ్చే సీజన్లో ఎలాగైనా విజేతగా నిలవాలని భావిస్తున్న చెన్నై జట్టు అనేక రకాల వ్యూహాలను రచిస్తోంది. త్వరలో జరిగే మెగా వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది.. కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా వస్తున్న నేపథ్యంలో.. టాప్ ఆర్డర్లో కీలకమైన ఇద్దరు ఆటగాళ్ల కోసం తీవ్రంగా మదనం సాగిస్తోంది. గత సీజన్లో కాన్వే చెన్నై జట్టుకు గొప్ప ఆరంభాలను ఇచ్చాడు. రుతురాజ్ – కాన్వే అ
    ద్వయం విజయవంతమైన జోడిగా నిలిచింది. దీంతో కాన్వే ను దక్కించుకునేందుకు చెన్నై జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని తెలుస్తోంది.. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాటి ని వేలంలో కొనుగోలు చేయాలని చెన్నై జట్టు భావిస్తోంది. ఇక వికెట్ కీపర్ ఈశాన్ కిషన్ కోసం భారీగానే చెల్లించాలని చెన్నై జట్టు ప్రణాళిక రూపొందించింది. అయితే చెన్నై జట్టు ప్రణాళికలో రిషబ్ పంత్ లేకపోవడంతో రుతు రాజ్ గైక్వాడ్ కోసం ఏకంగా 18 కోట్ల చెల్లించి రిటైన్ చేసుకుంది. అయితే కిషన్ ను కొనుగోలు చేస్తే ధోనికి వారసుడు వచ్చినట్టు అవుతాడని, బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలోపేతం అవుతుందని చెన్నై జట్టు భావిస్తోంది.

    ఆ స్థానంలో వారిని భర్తీ చేయాలని..

    నాలుగో స్థానంలో శివందూబే ఖరారైనట్టే. ఇక ఐదో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్.. అతడు వద్దనుకుంటే స్పిన్ ఆల్ రౌండర్ ను తీసుకోవాలని చెన్నై జట్టు యోచిస్తోంది.. మాక్స్ వెల్, ఫిలిప్స్, లివింగ్ స్టోన్, సాంట్నర్ ను తీసుకోవాలని నిర్ణయిస్తోంది. ఒకవేళ మాక్స్ వెల్, లివింగ్ స్టోన్ కోసం మాజీ జట్లు వేలంలో ఆర్టీఎం కార్డు ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్లో రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, ధోని ఉన్న నేపథ్యంలో.. స్పిన్ బౌలర్లను దక్కించుకోవాలని చూస్తోంది. ఇక స్థానిక ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ లలో ఎవరో ఒకరిని భారీ మొత్తానికి కొనుగోలు చేయాలని చెన్నై జట్టు యోచిస్తోంది. వీరు మాత్రమే కాకుండా శార్దుల్ ఠాకూర్, తుషార్ దేశ్ పాండే, అన్శుల్ కాంబోజ్, నటరాజన్, జయదేవ్, ఖలీల్ అహ్మద్ ను కూడా సొంతం చేసుకోవాలని చెన్నై జట్టు గట్టి ప్రణాళికతో ఉంది.