Kamala Harris: ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. 79 ఏళ్ల వయసులో అధ్యక్ష బరిలో నిలిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. 312 ఎలక్టోర్ ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించి వైట్ హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని అటు అమెరికన్లు, ఇటు సర్వే సంస్థలు భావించారు. ఆస్ట్రాలజిస్టులు కూడా కమలావైపే మొగ్గు చూపారు. కానీ, అందరి అంచనాలు తలకిందులయ్యాయి. కమలా హారిస్ కనీసం మద్దతు ఇవ్వలేకపోయింది. డొనాల్డ్ ట్రంప్ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. వైట్‌హౌస్‌లో 2025, జనవరి 20న అడుగు పనెట్టబోతున్నారు. ఇక కమలా ఓటమి తర్వాత మాట్లాడుతూ తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఫలితాలపై ఇంకా సమీక్ష చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ ఫలితాలపై రివ్యూ నిర్వహించే అవకాశం ఉంది. అయితే రివ్యూకు ముందే.. కొన్ని పుకార్లు.. షికార్లు చేస్తున్నాయి. అమెరికా ఓటమకి కారణాలపై పార్టీతోపాటు అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
వెన్నుపోటు పొడిచారా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు వెన్నుపోటు పొడిచారని తెలుస్తోంది. బైడెన్ ఎన్నికల రేసులో ఉంటే.. ట్రంప్ 400 ఎలక్టోర్ ఓట్లు గెలుస్తాడని వైట్‌హౌస్ అంతర్గత సర్వేలో తేలింది. ఈ విషయాన్ని మాజీ అధ్యక్షుడు బారర్ ఒబామ4ఆకు గతంలో స్పీర్ చైటర్‌గా పనిచేసిన జాన్ ఫ్రావూ పేర్కొన్నారు. బైడెన్ రేసులో నిలబడి తప్పు చేశాడని అభిప్రాయపడ్డారు. అయితే డెమోక్రాట్లకు పూర్తిగా నష్టం జరిగే వరకూ ఈ విషయాన్ని మైడెన్ అంగీకరించలేదు. తన పాలనను సమర్థించుకున్నారు. తాజాగా కమలా ఓటమికి కూడా బైడెన్ బృందమే కారణమని తెలిపారు. అధ్యక్షుడు బైడెన్ కమలాకు వెన్ను పోటు పొడిచారని ఆరోపించారు. ఆమె గెలవదని మీడియాకు ముందే మైడెన్ బృందం లీకులు ఇచ్చిందని జాన్ ఫ్రాపూ తెలిపారు.
బైడెన్‌ను తప్ప పట్టిన నాన్సీ పెలోసీ..
ఇక డెమొక్రటిక్ పార్టీ ఓటమికి బైడెన్‌పై ఆరోపణలు పెరుఉతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ సీనియర నేత నాన్సీ పెలోసీ కూడా బైడెన్‌ను తప్పు పట్టారు. ఆమె న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడారు. అధ్యక్షుడు రేసు నుంచి తొందరగా వైదొలిగి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. అప్పటికే రేసులో కమలా ట్రంప్ ఉండి.. ఓపెన్ ప్రైమరీలు జరిగేవిని తెలిపారు. హారిస్‌ను బైడెన్ నామినేట్ చేయడానికి, ప్రైమరీలు నిర్వహించడానికి సమయం లేదని తెలిపారు. అయినా హారిస్ పోరాటం ఆశలు పెంచిందని పేర్కొన్నారు.