https://oktelugu.com/

Sandeep Vanga: సందీప్ వంగ డైరెక్షన్ లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆ బాలీవుడ్ స్టార్ హీరో..? కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి హీరోలు మాత్రమే కనిపిస్తారు వాళ్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా హీరోలు చేసే విన్యాసాలు ప్రతి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. కానీ దాని వెనుక ఒక దర్శకుడు ఉన్నాడనే విషయాన్ని ఎవరు అర్థం చేసుకోరు. ఇక మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో దర్శకులు హీరోలు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహిస్తూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 10, 2024 / 12:29 PM IST

    Directors beyond Sandeep Reddy Vanga cant even come

    Follow us on

    Sandeep Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన సందీప్ రెడ్డివంగ బాలీవుడ్ ప్రేక్షకులను అమితంగా ఆకర్షించడంలో చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఆయన ఎక్కడైతే ప్రస్తానాన్ని మొదలు పెట్టాడో అక్కడి నుంచి వరుస సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతున్నాయనే చెప్పాలి. ఇక అలాంటి దర్శకుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా మన అదృష్టమనే చెప్పాలి… ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులు అతని సినిమాలా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇది ఏమైనప్పటికి ఆయన మాత్రం ఎవ్వరికి లొంగకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే కొంతమంది బాలీవుడ్ హీరోలు సైతం అతనితో మాట్లాడుతూ సినిమాలు సందీప్ డైరెక్షన్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

    ముఖ్యంగా షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో కూడా సందీప్ వంగ డైరెక్షన్ లో సినిమాలని సందీప్ ను ఇంటికి పిలిపించుకొని మరి తనకు సరిపడా కథను రెడీ చేయమని సినిమా చేద్దామని చెప్పారట. కానీ సందీప్ మాత్రం ప్రస్తుతం తనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయని అవి పూర్తి అయిన తర్వాత చూద్దామని చెప్పారట.

    బాలీవుడ్ లో ఆయన్ని విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటే స్టార్ హీరోలు సైతం అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ అనేది ఆయన సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు కాబట్టి ప్రేక్షకుల నుంచి వచ్చే జన్యున్ ఒపీనియన్ ను తీసుకొని చాలామంది హీరోలు అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అర్జున్ రెడ్డి లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందించిన తర్వాత సందీప్ రెడ్డి వంగ అసలు ఎవరికి వినకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

    ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రతి సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం విశేషం. అలాగే ఆ సినిమాలు భారీ కలెక్షన్లను కూడా రాబడుతుండటం ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఇక ప్రొడ్యూసర్స్ కూడా తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు… ఏది ఏమైనా కూడా ఆయన రేంజ్ ఏంటో సినిమాకి చూపిస్తూ వస్తున్నాడు… కాబట్టి ఇక మీదటకు కూడా ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించే అవకాశాలైతే ఉన్నాయి…