Gautam Gambhir: టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకం నాడే.. రాహుల్ ద్రావిడ్ సంచలన నిర్ణయం.. నాకు అవి వద్దంటూ బీసీసీఐకి స్పష్టీకరణ

జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకోవడం తో బీసీసీఐ 125 కోట్ల బోనస్ ప్రకటించింది.. ఇందులో రాహుల్ ద్రావిడ్ కు తన మాట కింద ఐదు కోట్లు వచ్చాయి. అయితే ఈ బోనస్ విషయంలో రాహుల్ ద్రావిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని సాధించడంలో రాహుల్ ద్రావిడ్ కీలకపాత్ర పోషించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 4:53 pm

Gautam Gambhir

Follow us on

Gautam Gambhir: టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. గత మంగళవారం బీసీసీఐ సెక్రటరీ జై షా గంభీర్ నియామకానికి సంబంధించిన వివరాలను వెల్లడించాడు. గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వకముందే.. టీమిండియా కు ఇన్నాళ్లుగా హెడ్ కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం పలువురి ప్రశంసలు పొందుతోంది.

జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకోవడం తో బీసీసీఐ 125 కోట్ల బోనస్ ప్రకటించింది.. ఇందులో రాహుల్ ద్రావిడ్ కు తన మాట కింద ఐదు కోట్లు వచ్చాయి. అయితే ఈ బోనస్ విషయంలో రాహుల్ ద్రావిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని సాధించడంలో రాహుల్ ద్రావిడ్ కీలకపాత్ర పోషించాడు. టీమిండియాను అని రంగాలలో ముందుండేలా శిక్షణ ఇచ్చాడు. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ నైపుణ్యం వల్ల టీమిండియా టి20 వరల్డ్ కప్ లో పరాజయం అనేది లేకుండా ముందుకు సాగింది. ఐర్లాండ్ నుంచి మొదలు పెడితే దక్షిణాఫ్రికా వరకు వరుస విజయాలు సాధించింది.

టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకోవడం ద్వారా తన పదవీ కాలాన్ని రాహుల్ ద్రావిడ్ ఘనంగా ముగించాడు. 17 ఏళ్ల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలుచుకోవడంతో బీసీసీఐ 125 కోట్ల నజరానా ప్రకటించింది. టీమిండియాలోని 15 మంది ఆటగాళ్లకు ఐదు కోట్ల చొప్పున, రిజర్వ్ ఆటగాళ్లకు కోటి చొప్పున పంపిణీ చేసింది. ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రావిడ్ కు 5కోట్లను బోనస్ గా ఇచ్చింది. బ్యాటింగ్ కోచ్ విక్రమ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ కు తలా 2.5 కోట్లను ఇచ్చింది. ఈ క్రమంలో రాహుల్ ద్రావిడ్ తన బోనస్ ను సగానికి తగ్గించి.. మిగతా అందరికీ సమానంగా ఇవ్వాలని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. “రాహుల్ ద్రావిడ్ విలక్షణమైన నిర్ణయం తీసుకున్నాడు. బోనస్ గా వచ్చిన ఐదు కోట్లను కోచింగ్ స్టాఫ్ తో సమానంగా పంచుకోవాలని భావిస్తున్నాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని తనను బీసీసీఐ ప్రత్యేకంగా చూడడాన్ని రాహుల్ ద్రావిడ్ ఒప్పుకోవడం లేదు. అందుకే కోచింగ్ స్టాఫ్ తో సమానంగా తనకు కూడా 2.5 కోట్లను ఇవ్వాలని రాహుల్ ద్రావిడ్ కోరుతున్నాడు. అతడి విజ్ఞప్తిని మేము అర్థం చేసుకున్నాం. అతడి నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా గౌరవిస్తామని” బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.

ఇక 2018లో అండర్ 19 జట్టు ప్రపంచ కప్ సాధించినప్పుడు.. భారత యువజట్టును రాహుల్ ద్రావిడ్ ముందుండి నడిపించాడు. అతడి ఆధ్వర్యంలో టీమ్ ఇండియా సంచలన విజయాలు సాధించింది. ఆ సమయంలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి బీసీసీఐ బోనస్ ప్రకటించింది. రాహుల్ ద్రావిడ్ కు అత్యధికంగా 50 లక్షలు ఇచ్చింది. సహాయక సిబ్బందికి 20 లక్షల చొప్పున, ఒక్కో ఆటగాడికి 30 లక్షల చొప్పున అందజేసింది. అయితే ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్ అందరితోపాటు తనకు సమానంగా బోనస్ ఇవ్వాలని బీసీసీఐ అధికారులను కోరాడు. అతని విజ్ఞప్తిని అర్థం చేసుకున్న బీసీసీఐ బోనస్ ను పూర్తిగా మార్చి.. సిబ్బందికి 25 లక్షల చొప్పున అందించింది. ఇప్పుడు మరోసారి రాహుల్ ద్రావిడ్ అలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.