https://oktelugu.com/

Jabardasth Varsha: ఆస్తి కోసం కక్కుర్తి పడ్డ జబర్దస్త్ వర్ష, పక్కింటాయన పెళ్ళాం అయ్యిందా… కానీ ఊహించని షాక్!

Jabardasth Varsha: ఇమ్మాన్యుయేల్ తో వర్ష నడిపిన లవ్ ట్రాక్ ఆ మధ్య బాగా హైలెట్ అయింది. నిజంగానే లవర్స్ అన్నటుగా ఈ జంట ఆడియన్స్ ని నమ్మించారు. కానీ అదంతా షోలో భాగమే. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేశారని తర్వాత తెలిసింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : July 10, 2024 / 04:47 PM IST

    Jabardasth Varsha Ready to act wife role for 20 acres land,

    Follow us on

    Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ పాపులర్ అయింది. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ తో వర్ష నడిపిన లవ్ ట్రాక్ ఆ మధ్య బాగా హైలెట్ అయింది. నిజంగానే లవర్స్ అన్నటుగా ఈ జంట ఆడియన్స్ ని నమ్మించారు. కానీ అదంతా షోలో భాగమే. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేశారని తర్వాత తెలిసింది. అయితే చాలా కాలంగా వర్ష జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ నవ్విస్తుంది.

    తాజాగా స్కిట్ మాత్రం హిలేరియస్ గా ఉంది. తేరగా వస్తుందని 20 ఎకరాల భూమి కోసం ఆశపడింది వర్ష. తీరా విషయం తెలిశాక అవాక్కయింది. దెబ్బకు ఆమెకు మైండ్ బ్లాక్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే .. స్కిట్ లో పొట్టి రియాజ్ భార్య గా వర్ష నటిస్తుంది. ఈ క్రమంలో పక్కింటి అజర్ వర్ష కి లైన్ వేస్తుంటాడు. దీంతో ఆ విషయాన్ని గమనించిన వర్ష తన భర్త రియాజ్ తో చెబుతుంది. దీంతో అతను అజర్ దగ్గరకు వెళ్లి గొడవ పెట్టుకుంటాడు.

    నా భార్య ని ఎందుకు చూస్తున్నావు అని అడుగుతాడు. మా నాన్నకి వంద ఎకరాలు ఆస్థి ఉంది. నాకు ఇక్కడ భార్య, కొడుకు ఉన్నారని అబద్ధం చెప్పాను. ఇప్పుడు చూడ్డానికి మా నాన్న వస్తున్నాడు. భార్యగా నటించేందుకు ఎవరు దొరకలేదు. 20 ఎకరాలు రాసిస్తాను అని చెప్పినా ఎవరు రావడం లేదని అజర్ చెప్పుకొస్తాడు. దీంతో 20 ఎకరాలు కొట్టేయొచ్చు అని వర్ష ను భార్యగా నటించడానికి ఒప్పిస్తాడు రియాజ్.

    వాళ్లకు కొడుకుగా రియాజ్ యే వెళ్తాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది. అజర్ తండ్రిగా ఇమ్మాన్యుయేల్ వస్తాడు. ఇక కొడుక్కి శోభనం ఏర్పాట్లు చేస్తుంటాడు. ఎవరి కోసం శోభనం ఏర్పాట్లు అని రియాజ్ అడగ్గా .. మీ అమ్మా నాన్నలకు అని ఇమ్మూ కూల్ గా చెబుతాడు. దీంతో రియాజ్ షాక్ అవుతాడు. ఒక రోజు భార్యగా నటించడానికి వెళ్తే ఏకంగా వర్షకి శోభనం అంటూ ట్విస్ట్ ఇస్తాడు అజర్ తండ్రి. ఈ సీన్ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది. అదన్నమాట సంగతి…