Gladiator 2 Trailer: 2000 వ సంవత్సరంలో హాలీవుడ్ మూవీ గా వచ్చి పెను ప్రభంజనాన్ని సృష్టించిన ‘గ్లాడియేటర్ ‘ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఫేవరెట్ మూవీగా మారిపోయింది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ విజువల్ వండర్ గా తీసుకురావడమే కాకుండా భారీ యుద్ద నేపథ్యాలతో కూడిన కథాంశం గా ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇక ఇప్పటికే ట్రెండింగ్ లో నిలిచిన ఈ ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా దమ్మెంటో మనకు అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల్ని మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా కనిపిస్తుంది. ఇక రిడ్లి స్కాట్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మొదటి పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి కొనసాగింపుగా ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరుగుతున్నాయి. ఒక్కసారిగా ఈ ట్రైలర్ ఈ సినిమా మీద ఉన్న అంచనాలను భారీ స్థాయి లో పెంచేసిందనే చెప్పాలి. ఇక తొందర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. ఇక రసేల్ క్రో వారసుడు అయిన ‘లూసియస్ ‘ ను ప్రధానం గా చేసుకొని ఈ కథ తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిన్నతనంలోనే లూసియాస్ మదర్ తనని రక్షించుకోవడానికి ఆఫ్రికాకు పంపిస్తుంది ఇక తను పెద్దాయ్యాక మళ్ళీ తిరిగి వాళ్ల ప్రాంతానికి వస్తాడు.
అక్కడి నుంచి కథ ఎలాంటి మనుపులు తిరగబోతుంది అనే పాయింట్ ను హైలెట్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ ను మన ముందుకు తీసుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఇక డైరెక్టర్ ఈ సినిమా ట్రైలర్ తో మాత్రం పిచ్చెక్కించ్చాడు. అన్ని సవ్యం గా జరిగితే ఈ సినిమాని ఈ సంవత్సరం నవంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…