Test series: ఇంగ్లీష్ గడ్డపై మరో ఆరు రోజుల్లో గిల్ ఆధ్వర్యంలో భారత జట్టు టెస్టు సిరీస్ ఆడబోతోంది. 2007 తర్వాత ఇంతవరకు ఆంగ్లేయులపై భారత్ టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేదు.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భారత జట్టు కృత నిశ్చయంతో ఉంది.
గిల్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత బృందం.. ఇప్పటివరకు ఆంగ్లేయులతో రెండు అనధికారిక టెస్టులు ఆడింది. ఫలితంతో సంబంధం లేకుండా ఈ రెండు మ్యాచ్లలో భారత ప్లేయర్లు అదరగొట్టారు. బౌలింగ్లో, బ్యాటింగ్లో దుమ్మురేపారు.. ఒకవేళ ఈ అనధికారిక టెస్టులు ఐదు రోజులపాటు జరిగితే ఫలితం మరో విధంగా ఉండేది.. ఇంగ్లీష్ గడ్డపై వచ్చిన రెండు అవకాశాలలోనూ గిల్ తనను తాను నిరూపించుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసినప్పటికీ గొప్పగా పరుగులు చేయలేకపోయాడు. ఇప్పుడు సారధిగా ఆంగ్ల గడ్డమీద అతడు అడుగుపెట్టాడు. అతడి సారధ్యానికి ఇంగ్లీష్ జట్టుతో జరిగే సిరీస్ పరీక్ష లాంటిది.. ఈ పరీక్షలో అతడు నెగ్గితే సారధిగా అతని స్థానం మరింత స్థిరమవుతుంది.. ఇక ఇంగ్లీష్ గడ్డమీద అడుగుపెట్టిన నాటి నుంచి కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.. ఇటీవల నార్తాంప్టన్ లో రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టుపై రాహుల్ 151 పరుగులు చేశాడు. ఇక శుక్రవారం బెకెన్ హం ప్రాంతంలో జరిగిన ఇంట్రా స్క్వాడ్ వార్మప్ మ్యాచ్లో రాహుల్ శతకం సాధించాడు.. ఇండియా – ఇండియా -ఏ జట్లు ఈ మ్యాచ్లో తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా కేఎల్ రాహుల్ తన సన్నద్ధతను మరోసారి నిరూపించాడు.
ఈ వార్మప్ మ్యాచ్ కు ఫస్ట్ క్లాస్ హోదా లేదు.. కాకపోతే ఇది నాలుగు రోజులపాటు జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఈ మ్యాచ్ భారత బృందంలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుదని మేనేజ్మెంట్ భావిస్తోంది. భారత జట్టు యాజమాన్యం దీనిని క్లోజ్ టు డోర్ వ్యవహారం లాగా ఉంచుతున్నది కాబట్టి.. మ్యాచ్ గురించి బయటికి పెద్దగా తెలియడం లేదు. ఇక మీడియా సిబ్బందిని కూడా పరిమితం చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే ఈ మ్యాచ్ కు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి.
గిల్ సరికొత్త అవతారం
ఇక ఈ మ్యాచ్లో సారధిగా గిల్ సరికొత్త అవతారాన్ని ఎత్తాడు. గతంలో ఇంగ్లీష్ గడ్డ మీద అతడు బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కోవడంలో అతడు విఫలమయ్యేవాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతడు నిలబడ్డాడు. స్థిరంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా హాఫ్ స్టంప్ బంతులను సులభంగా ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ ప్రాక్టీస్ అతనిలో సారధ్య లక్షణాలను మరింత పటిష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు..” అనతి కాలంలోనే గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. వాటిని అతడు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడని అనుకుంటున్నాం. అతడి పట్టుదల చూస్తే అది నిజం అనిపిస్తోందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
GLIMPSE OF INDIA VS INDIA A
KL Rahul batting and Bumrah and Kuldeep fielding pic.twitter.com/bznF9N9hY5
— Prakash (@definitelynot05) June 13, 2025