Bigg Boss 9 Telugu: మరో రెండు మూడు నెలల్లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ని ఇంతకు ముందు సీజన్స్ లాగా కాకుండా చాలా కొత్తగా ఉండేలా ప్లానింగ్ చేస్తున్నారు. అంతే కాదు కంటెస్టెంట్స్ విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీలు ఈసారి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువశాతం ఆడియన్స్ కి బాగా ముఖ పరిచయం ఉన్నటువంటి సెలబ్రిటీస్ నే ఈసారి ఎంచుకోనున్నారు. అందుకు తగ్గట్టు వచ్చే నెల నుండి ఇంటర్వ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా లో లీకైన కొంతమంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రతీ వారం కొత్త జాబితా వివరాలు మనకు సోషల్ మీడియా లో కనిపిస్తూనే ఉంటాయి కానీ, ఇప్పుడొచ్చిన లిస్ట్ మాత్రం దాదాపుగా ఖరారు అయిన లిస్తే అని అంటున్నారు. ఇంతకీ ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
ఈ లిస్ట్ లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఛత్రపతి చంద్ర శేఖర్(Chandra Shekar). దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించే ప్రతీ సినిమాలో ఇతను ఉంటాడు. గ్లోబల్ వైడ్ గా ప్రకంపనలు పుట్టించిన #RRR లో కూడా ఈయన కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ మూవీ లో కూడా ఇతను కచ్చితంగా నటించే ఉంటాడు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే జనాలకు ఇతని పేరు పెద్దగా గుర్తు ఉండకపోవచ్చు కానీ ముఖం చూస్తే గుర్తు పట్టని వాళ్ళు ఉండరు. ప్రస్తుతం ఈయన టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తూ ఫుల్ బిజీ గా ఉన్నారు. ఇంత బిజీ ఆర్టిస్ట్ ని బిగ్ బాస్ టీం సంప్రదించింది. మంచి రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ ఇచ్చింది. మరి వేళ్తాడో లేదో చూడాలి.
Also Read: Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9′ లోకి కంటెస్టెంట్ గా నందమూరి హీరో..ఆడియన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
అదే విధంగా ఈ షోలో కంటెస్టెంట్స్ సాయి కిరణ్, తేజస్విని, కల్పిక గణేష్,జ్యోతి రాయ్, యూట్యూబర్ శ్రావణి వర్మ తదితరుల పేర్లు కూడా ఖరారు అయ్యాయని, త్వరలోనే బిగ్ బాస్ టీం వీళ్ళను సంప్రదిస్తారని తెలుస్తుంది. ఇకపోతే చాలామంది హోస్ట్ విషయం లో మార్పు ఉండాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), బాలయ్య(Nandamuri Balakrishna) వంటి వారు హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు వినిపించాయి కానీ, అలాంటిదేమి లేదని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. నాగార్జున(Akkineni Nagarjuna) నే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తాడట. గత సీజన్ పెద్ద హిట్ అవ్వాల్సినది, నాగార్జున వల్లనే యావరేజ్ గా నిలిచిందని విశ్లేషకుల అభిప్రాయం. కానీ 12 వ సీజన్ వరకు నాగార్జున తో ఒప్పందం ఉంది కాబట్టి, ఈ సీజన్ కి ఆయనే హోస్ట్ గా కొనసాగుతాడని తెలుస్తుంది. వచ్చే నెలలో ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.