greatest ball of the decade : టెస్ట్ క్రికెట్ సుదీర్ఘంగా సాగుతుంది. ఆ ఫార్మాట్లోనే టెస్ట్ అని పేరు ఉంది కాబట్టి.. ప్రతిరోజు ఒక పరీక్ష లాగానే సాగుతుంది. కాకపోతే టెస్ట్ క్రికెట్లో బ్యాటర్లు బీభత్సంగా పరుగులు చేయరు. దూకుడుగా సిక్సర్లు కొట్టలేరు. ధాటిగా ఫోర్లు బాదలేరు. అంతటి వీరేంద్ర సెహ్వాగ్ కూడా టెస్ట్ క్రికెట్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల ఒక బ్యాటర్ లో పరిణితి వస్తుంది. ఒక బౌలర్లో సామర్థ్యం పెరుగుతుంది. ఒక ఫీల్డర్లో సహనం అనేది ఎక్కువవుతుంది. అందువల్లే ప్రతి క్రికెటర్ కూడా కచ్చితంగా టెస్ట్ ఆడాలి అంటారు మాజీ ఆటగాళ్లు. కాకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్లో టీమిండియాలో టెస్ట్ ఫార్మాట్ లో చోటు లభించడం దాదాపు అసాధ్యం. ప్రాంజీలలో రంజీలలో, ఫార్మాట్లలో అదరగొడితేనే జాతీయ టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది.
ఇదో అద్భుతం
టెస్ట్ క్రికెట్ కు వన్నె తెచ్చిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. షేన్ వార్న్, మురళీధరన్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అజంతా మెండిస్, నాథన్ లయన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. ఫాస్ట్ బౌలర్లు కాకుండా.. వీరిని ఎందుకు ప్రస్తావించామంటే.. మీరు టెస్ట్ క్రికెట్లో చేసిన అద్భుతాలు అలాంటివి మరి.. ముఖ్యంగా ఆసియా ఉపఖండ మైదానాలలో స్పిన్ బౌలర్లకు అద్భుతమైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారత్, శ్రీలంక లాంటి జట్లలో బౌలర్లకు ఉపఖండ మైదానాలు ఎర్రతీవాచీ లాంటివి. ఈ మైదానాలలో స్పిన్ బౌలర్లు వికెట్ల వేటను అత్యంత సులువుగా చేయగలరు. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలో శ్రీలంక స్పిన్ బౌలర్ సందా కాన్ వేసిన బంతి తెగ వైరల్ అవుతున్నది.. కంగారు జట్టు సింహళీయుల జట్టుతో పోటీపడినప్పుడు తీసిన వికెట్ అది. నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బర్న్ స్, స్మిత్ క్రీజ్ లో ఉన్నారు. అప్పటికే బర్న్ స్ 29 పరుగులు చేశాడు. ఈ దశలో వచ్చిన సందకాన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. హాఫ్ సైడ్ దిశగా అతడు బంతిని వేశాడు. అది వెంటనే టర్న్ అయ్యి వికెట్లను పడగొట్టింది. వాస్తవానికి బంతి హాఫ్ సైడ్ దిశగా వెళ్తుందని బ్యాటర్ అనుకున్నాడు. కానీ అతని అంచనాలకు భిన్నంగా బంతి తన గమనాన్ని మార్చుకుంది. వెంటనే వికెట్లను పడగొట్టింది. ఈ మ్యాచ్ జరిగి చాలా రోజులవుతున్నప్పటికీ అభిమానులు ఇప్పటికీ ఆ బంతిని.. ఆ బంతి వేసిన బౌలర్ ను మననం చేసుకుంటున్నారు. ఈ బంతి ఈ దశాబ్దంలోనే అత్యంత అత్యుత్తమమైనదని పేర్కొంటున్నారు.
2nd greatest Ball of the decade? pic.twitter.com/hY8U7I2W19
— GzNem (@diablo_kells) June 27, 2025