Virtual court hearing : మన దేశంలో అన్ని వ్యవస్థలు ప్రజలకు భరోసా కల్పించలేకపోతున్నప్పటికీ.. ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఇప్పటికీ న్యాయవ్యవస్థ ఎంతో కొంత బాధ్యత తీసుకొని ప్రజలకు నమ్మకం కలిగిస్తోంది. బతుకు మీద భరోసా కల్పిస్తోంది. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాలను.. అవినీతికి పాల్పడుతున్న అధికారులను బజారుకీడ్చి.. బాధ్యతను గుర్తుచేస్తోంది. అందువల్లే మనదేశంలో న్యాయ వ్యవస్థ గొప్పగా వర్ధిల్లుతోంది. న్యాయం అనేది సత్వరం అందక పోయినప్పటికీ.. ఇప్పటికైనా న్యాయం లభిస్తుందని భరోసాను మన దేశ న్యాయవ్యవస్థలు అందిస్తున్నాయి. అందువల్లే పెద్ద పెద్ద కేసుల్లోనూ న్యాయమూర్తులు ఈ దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే తీర్పులు ఇవ్వడం విశేషం. అయితే ఈ తీర్పులు సామాన్య ప్రజలకు ఊరట ఇచ్చేలా.. భరోసా కల్పించేలా ఉంటున్నాయి. అందువల్లే న్యాయ వ్యవస్థను మన దేశ ప్రజలు నమ్ముతున్నారు. కష్టం వస్తే న్యాయస్థానాల గుమ్మం తొక్కుతున్నారు.
చేయకూడని పని చేశాడు
మనదేశంలో కేసులు అంతకంతకు పేరుకుపోతున్న నేపథ్యంలో న్యాయమూర్తులు ఇటీవల కాలంలో వర్చువల్ విచారణను ప్రారంభించారు. ప్రత్యేకమైన కేసులలో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఇటీవల గుజరాత్ ప్రధాన న్యాయస్థానంలో విచారణకు వర్చువల్ గా ఒక వ్యక్తి హాజరయ్యాడు. అయితే అతడు చేసిన పని తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈనెల 20న హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్.. ఓ తీవ్రమైన కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వ్యక్తి టాయిలెట్ సీట్ పై కూర్చున్నాడు. అక్కడ కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్నాడు. అయితే తను టాయిలెట్ సీట్ లో కూర్చున్న దృశ్యాలను న్యాయమూర్తి ప్రత్యేకంగా పరిశీలించలేదు. అయితే ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత.. ఆ దృశ్యం కనిపించడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలకు ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు బయటికి తిరిగి రాలేదు. ఇటీవల ఓ కేసులో వర్చువల్ విచారణలో ఓ వ్యక్తి ధూమపానానికి పాల్పడ్డాడు. దీనిపై గుజరాత్ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడికి 50,000 అపరాధ రుసుం విధించింది. ” కేసు విచారణలో గౌరవనీయ న్యాయస్థానానికి సహకరించాలి. అదే సమయంలో న్యాయవ్యవస్థ విధించిన నిబంధనలు పాటించాలి. ఈ నిబంధనలు న్యాయమూర్తులకు మాత్రమే కాదు అందరికీ వర్తిస్తాయి. అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తప్పవని” అప్పట్లో న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.