Ramcharan Vijay Deverakonda Pan india movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది'(Peddi Movie) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఆయన పై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. దానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ కూడా సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. అక్టోబర్ లోపు దాదాపుగా టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ బుచ్చి బాబు. ఈమధ్యనే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సెన్సేషనల్ హిట్ అవ్వడం తో ఈ సినిమాపై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. IPL సీజన్ లో అయితే పెద్ది షాట్ ఏ రేంజ్ లో నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో వేల సంఖ్యలో రీల్స్ కూడా వచ్చాయి.
వచ్చే ఏడాది మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇది కదా రామ్ చరణ్ నుండి మేము కోరుకునేది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమా ఏమిటి?,సుకుమార్ తో వెంటనే సినిమా మొదలు పెడుతాడు అని అంతా అనుకున్నారు. కానీ సుకుమార్ ఒక స్టోరీ ని ఎన్నేళ్లు చెక్కుతాడో మన అందరికీ తెలిసిందే. పైగా రామ్ చరణ్ తో సినిమా అంటే రంగస్థలం, పుష్ప ని మించి తియ్యాలి. ఆ విషయం లో అసలు వెనక్కి తగ్గే సమస్యే లేదు అనే విధంగా పని చేస్తాడు. అందుకే ఇంకా ఏడాదికి పైగా పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధమయ్యే అవకాశాలు ఉండడం తో ఈలోపు రామ్ చరణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని దింపే ఆలోచనలో ఉన్నాడట.
వివరాల్లోకి వెళ్తే చాలా కాలం నుండి రామ్ చరణ్ ఒక హిందీ ప్రాజెక్ట్ చేసే విషయం లో చర్చలు జరుపుతున్నాడు. బాలీవుడ్ లో కిల్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నిఖిల్ నగేష్ భట్ రామ్ చరణ్ తో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం రెడీ అయిపోయింది. రామ్ చరణ్ ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం లో ఒక ముఖాయమైన పాత్ర కోసం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ని ఇప్పటికే సంప్రదించారట మేకర్స్. సినిమా కథని పూర్తిగా మలుపు తిప్పే ఈ క్యారక్టర్ విజయ్ దేవరకొండ మాత్రమే చేయగలడని డైరెక్టర్ బలంగా నమ్ముతున్నాడట. మరి ఆ క్యారక్టర్ ని చేయడానికి విజయ్ దేవరకొండ ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.