https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంతమంది పాన్ ఇండియన్ హీరోలు రాబోతున్నారా..? డైరెక్టర్ శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

ప్రస్తుతం నేషనల్ వైడ్ గా 'పుష్ప 2' మేనియా నడుస్తుంది. మరో వారం రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' మేనియా మొదలు కాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 13, 2024 / 09:43 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ‘పుష్ప 2’ మేనియా నడుస్తుంది. మరో వారం రోజుల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మేనియా మొదలు కాబోతుంది. జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR తర్వాత రామ్ చరణ్ హీరో గా నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అనకాపల్లి నుండి అమెరికా వరకు ఒక్క రికార్డుని కూడా మిగల్చకుండా బద్దలు కొట్టడానికి ఇప్పటి నుండే ప్లానింగ్స్ వేస్తున్నారు. ఓవర్సీస్ చిన్నగా ఒక్కో దేశం లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు అవుతున్నాయి. లండన్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, 6 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. రేపు నార్త్ అమెరికా లో గ్రాండ్ గా బుకింగ్స్ ప్రారంభించబోతున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను కనీవినీ ఎరుగని రేంజ్ ప్లాన్ చేసాడట డైరెక్టర్ శంకర్. ఆయన ఒకప్పుడు ప్రొమోషన్స్ కోసం చాలా ప్రత్యేకమైన ప్రణాళికతో వెళ్ళేవాడు. కేవలం ప్రొమోషన్స్ కోసమే కోట్ల రూపాయిలు నిర్మాతలతో ఖర్చు పెట్టించేవాడు. అవి వర్కౌట్ కూడా అయ్యేవి. అదే విధంగా ఈసారి కూడా ప్లానింగ్ చేసాడు. చెన్నై లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ని పిలవబోతున్నట్టు సమాచారం. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో తిరుపతి లో నివహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైదరాబాద్ లో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్, రాజమౌళి వంటి వారు ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. ఇలా ఎంతో గ్రాండ్ గా ‘గేమ్ చేంజర్’ ప్రొమోషన్స్ చేయబోతున్నారు మేకర్స్.

    ఇది ఇలా ఉండగా బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. షారుఖ్ ఖాన్ ని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పిలబోతున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా రణవీర్ సింగ్ తో కలిసి రామ్ చరణ్, శంకర్, కైరా అద్వానీ ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నారట. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్జి బాబు దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 15 వ తారీఖున ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి కాబోతుంది. 18 వ తారీఖు నుండి 10 వ తారీఖు వరకు నాన్ స్టాప్ గా ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ చేయడానికి రామ్ చరణ్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. త్వరలోనే ప్రొమోషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయనున్నారు మేకర్స్.