Telangana Premier League: క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. క్రికెట్లో భారత్ పెత్తనం సాగిస్తున్న క్రమంలో.. మనదేశంలో క్రికెట్ ఆధారంగా సాగే వ్యాపారం లక్షల కోట్లకు చేరుకుంది. అందువల్లే మన దేశంలో పుట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. రిచ్ క్రికెట్ లీగ్ గా రూపాంతరం చెందింది. చివరికి. ఫిఫా నిర్వహించే అంతర్జాతీయ ఫుట్ బాల్ కప్ ను కూడా తలదన్నేలా ఎదిగింది. ఐపీఎల్ వల్ల కేవలం మనదేశ క్రికెటర్లు మాత్రమే కాదు.. ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. జట్ల యాజమాన్యాలు భారీగా గడిస్తున్నారు. ఇక ప్రసార హక్కులు దక్కించుకున్న చానల్స్ అయితే కాసుల పంట పండించుకుంటున్నాయి.. అయితే ఐపీఎల్ తరహాలోనే మరో క్రికెట్ టోర్నీ కూడా పురుడుపోసుకోనుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఒక కీలక ప్రకటన చేశారు.
Also Read : క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ పై బిగ్ అప్డేట్.. తొలి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మధ్య అంటే!
తెలంగాణ ప్రీమియర్ లీగ్
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తోంది. ఇదే విషయంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఒక కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ మాదిరిగానే తెలంగాణలోనూ తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభిస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే హైదరాబాదులో ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఉంది. దానికంటే మించిన స్థాయిలో.. అహ్మదాబాద్ కంటే మరింత పెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని హైదరాబాద్ లో నిర్మించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు రూపొందిస్తున్నది.. ఇదే విషయాన్ని జగన్మోహన్ రావు ఇటీవల వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. క్రికెట్ విస్తరణకు సహకరించాలని.. నూతనంగా నిర్మిస్తున్న స్టేడియానికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు అందించాలని ఆయన కోరారు. దానికి రేవంత్ రెడ్డి కూడా తన సుముఖతను వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించడం ద్వారా వర్ధమాన ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు చెబుతున్నారు. దీనివల్ల క్రికెట్ విస్తరిస్తుందని.. ఆటగాళ్లకు ఆర్దిక భరోసా దక్కుతుందని.. జాతీయ జట్టులోకి ఎంపికవడానికి మార్గం సులభం అవుతుందని జగన్మోహన్ రావు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి అనేకమంది ఆటగాళ్లు జాతీయస్థాయిలో ప్రతిభ చూపుతున్నారు.. ఇంకా చాలామంది ఆటగాళ్లు ఉత్తమ ప్రతిభను చూపించేందుకు తహతలాడుతున్నారు. అలాంటి వారికి తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఒక వేదిక లాగా ఉంటుందని జగన్మోహన్ రావు వివరిస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో క్రికెట్ విస్తరణ మరింత వేగంగా జరుగుతుందని జగన్ మోహన్ రావు భావిస్తున్నారు.
Also Read : ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ పోరు వీటి మధ్యే.. ఇండియాతో తలపడే జట్టు ఏదంటే..