IPL 2025 Update ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian premier league 2025) కు సంబంధించి షెడ్యూల్ ను క్రిక్ బజ్(crick Buzz) అంచనా వేసింది. ” బిసిసిఐ (BCCI) అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం తొలి మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ (Kolkata Eden gardens) లో జరుగుతుంది. మార్చి 22న శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. గత సీజన్లో రన్నర్ అప్ గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ (sunrisers Hyderabad) మార్చి 23 ఆదివారం ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan royals) తో తలపడుతుంది. మే 25న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని.. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ఆ మ్యాచ్ నిర్వహిస్తారని” క్రిక్ బజ్ తన నివేదికలో పేర్కొంది.
ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూసుకుంది. ఇక ఈ ఏడాది జరిగేది 18 వ సీజన్. ప్రస్తుత సీజన్లో నిర్వహించే ఫైనల్ మ్యాచ్ తో పాటు ప్లే ఆఫ్ -2 మ్యాచ్ కూడా కోల్ కతా వేదికగానే నిర్వహించే అవకాశం ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ లు మాత్రం హైదరాబాదులోని ఉప్పల్ వేదికగా నిర్వహిస్తారు.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది ప్రారంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్, మరొక జట్టు ఆడతాయి. ఈ ఏడాది తొలి మ్యాచ్ కోల్ కతా , బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతేకాదు ప్రతి జట్టు సొంతమైదానంలో సగం మ్యాచ్ లలో తలపడాల్సి ఉంటుంది. మిగతా మ్యాచ్ లు ప్రత్యర్థి మైదానాలలో ఆడాల్సి ఉంటుంది. గతానికంటే భిన్నంగా ఈసారి ఢిల్లీ, రాజస్థాన్ జట్లు ఈసారి తమ సొంత మైదానాలతో పాటు, ఇతర మైదానాలలో కూడా ఆడతాయి. రాజస్థాన్ జట్టుకు సవాయి మాన్సింగ్ స్టేడియం సొంతమైదానం. ఇది జైపూర్ నగరంలో ఉంది.. ఈ నగరంలో ఐదు మ్యాచ్లను రాజస్థాన్ ఆడుతుంది. ఆ తర్వాత అస్సాంలోని బర్సా పారా మైదానంలో మిగతా మ్యాచ్లు ఆడుతుంది. ఢిల్లీ జట్టుకు అరుణ్ జెట్లీ మైదానం సొంత గ్రౌండ్ గా ఉంది. ఇది ఢిల్లీ నగరంలో ఉంది.. ఆ తర్వాత విశాఖపట్నంలోని క్రికెట్ మైదానంలో మిగతా మ్యాచులు ఆడుతుంది.
ఈ ఏడాది 639 కోట్లు
ఐపీఎల్ పేరుకు తగ్గట్టుగానే ఈ సీజన్లో ఆటగాళ్లపై అన్ని జట్లు డబ్బుల వరద పారించాయి. దాదాపు 182 మంది ఆటగాళ్ల కోసం 639.5 కోట్లను కుమ్మరించాయి. సౌదీ అరేబియాలోనే జెడ్డా నగరంలో ఈ మెగా వేలాన్ని నిర్వహించారు. ఈ సీజన్లో లక్నో జట్టు సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ ను దాదాపు 27 కోట్లకు పర్చేజ్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది హైయెస్ట్ రికార్డ్. ఆ తర్వాత పంజాబ్ జట్టు కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను 23.75 కోట్లకు సొంతం చేసుకుంది.