https://oktelugu.com/

Teamindia:జట్టు సెలక్షన్ పై నెటిజన్ల సెటైర్లు: భువనేశ్వర్ కు ఛాన్స్ పై మండిపాటు..

టీ 20 వరల్డ్ కప్ లో ఫెయిల్ అయిన తరువాత టీంఇండియా న్యూజిలాండ్ తో సిరీస్ కొనసాగించనుంది. భారత్ లో జరిగే ఈ సీరిస్ కోసం కొత్త జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అయితే ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ తో నిరాశ చెందిన భారత క్రీడాభిమానులు ఇంకా కోలుకోలేదు. దీంతో తాజాగా ప్రకటించిన జట్టుపై సోషల్ మీడియా వేదికగా క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ కు జట్టులో చోటు కల్పించడంపై మండిపడుతున్నారు. జట్టులో దాదాపు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2021 / 10:21 AM IST
    Follow us on

    టీ 20 వరల్డ్ కప్ లో ఫెయిల్ అయిన తరువాత టీంఇండియా న్యూజిలాండ్ తో సిరీస్ కొనసాగించనుంది. భారత్ లో జరిగే ఈ సీరిస్ కోసం కొత్త జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అయితే ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ తో నిరాశ చెందిన భారత క్రీడాభిమానులు ఇంకా కోలుకోలేదు. దీంతో తాజాగా ప్రకటించిన జట్టుపై సోషల్ మీడియా వేదికగా క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ కు జట్టులో చోటు కల్పించడంపై మండిపడుతున్నారు. జట్టులో దాదాపు సీనియర్లకు విశ్రాంతినిచ్చిన యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు. కానీ కొందరు యువ ఆటగాళ్లను కూడా పక్కన బెట్టి మరో మిస్టేక్ చేస్తున్నారని పోస్టులు పెడుతున్నారు. అయితే కొందరు భువనేశ్వర్ ఎంపికపై మద్దతు పలుకుతున్నారు. ఆయన ఎంపిక సరైందేనని అంటున్నారు.

    న్యూజిలాండ్ తో జరిగే పోరుకు భారత జట్టు రెడీ అయింది. రోహిత్ సారథ్యంలో టీ 20 ఆడనుంది. వైస్ కెప్టెన్ గా కేఎస్ రాహుల్ కు అవకాశం ఇచ్చారు. ఇందులో సీనియర్లు బుమ్రా, షమీలకు విశ్రాంతినిచ్చారు. శార్దూల్ ఠాకూర్ ను కూడా పక్కనబెట్టారు. అయితే టీ 20 ప్రపంచ కప్ లో విఫలమైన భువనేశ్వర్ ఎంపికపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఫామ్ లో లేకపోవడంతో పాటు 31 ఏళ్ల భువనేశ్వర్ యువ ఆటగాడు ఎలా అయ్యాడని అంటున్నారు. ఆయనను దేశవాలీ క్రికెట్ కు పంపించి ఫామ్ లోకి తేవాలని సూచనలిస్తున్నారు. అంతేకాకుండా భువనేశ్వర్ కు ఇదే చివరి సిరీస్ అని, మళ్లీ అతను కనిపించడని అంటున్నారు.

    మరోవైపు కొందరు అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారిని ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ లో సత్తా చాటిన వరుణ్ చక్రవర్తి, పృథ్వీషా నుంచ ఎందుకు తీసుకోలేదని అంటున్నారు. ఫాంలో ఉన్న హార్థిక్ పాండ్యాను కాదని భువనేశ్వర్ కు అవకాశం ఎలా ఇచ్చారని అంటున్నారు. అతనికి బదులు యువ ఆటగాడిని తీసుకోవాల్సిందని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం భువనేశ్వర్ ఎంపిక సరైందేనని, ఈ సీరిస్ లో అతను సత్తా చాటుతారని అంటున్నారు.

    ఇక రోహిత్ కెప్టెన్ ఎంపికపై హర్షం వ్యక్తమవుతోంది. రోహిత్ సారథ్యంలో జట్టు పటిష్టంగా మారనుందన్నారు. జట్టు ఎంపికలో రోహిత్ మార్క్ కనిపించిందని అంటున్నారు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారని, వీరు తమ సత్తా చాటేందుకు అవకాశం ఇచ్చారంటున్నారు. రాహుల్- రోహిత్ కాంబినేషన్లో కప్ సాధించడం సులభమే అంటున్నారు. అయితే ఓపెన్లరు ఐదుగురిని ఎంపిక చేయడంపై కొందరు విమర్శిస్తున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, వెంకటేశ్ అయ్యార్, ఇషాన్ కిషన్ లు ఓపెనర్లుగా ప్రకటించారు. అయితే రిషబ్ పంత్ కు విశ్రాంతి ఇవ్వాల్సిందని అంటున్నారు. ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన చాహర్ ను పక్కనబెట్టడం సబబు కాదంటున్నారు.