Team India In T20 : టీ -20 లలో ఎదురులేని టీమిండియా..ఇవేం రికార్డులు రా నాయన.. కాకలు తీరిన ఆస్ట్రేలియా కూడా సమీపంలో లేదు..

క్రికెట్.. ఈ పేరు వినిపిస్తే ఆస్ట్రేలియా గుర్తుకొస్తుంది.. క్రికెట్ ఇంగ్లాండ్ లో పుట్టినప్పటికీ.. ఆ గేమ్ లో ఆస్ట్రేలియా సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. అయితే టీ20 లో మాత్రం ఆస్ట్రేలియా కు అంత సీన్ లేదు. ఈ పొట్టి ఫార్మాట్ లో టీమిండియా ఎన్ని రికార్డులు నెలకొల్పిందంటే..

Written By: Anabothula Bhaskar, Updated On : October 13, 2024 1:55 pm

Team India In T20 International

Follow us on

Team India In T20 :  హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 297 రన్స్ చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ను 164 పరుగులకే కట్టడి చేసింది. తద్వారా 133 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో అనేక రికార్డులను సొంతం చేసుకుంది.

బౌండరీల పరంగా..

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ బౌండరీల పరంగా మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో మొదటి స్థానం దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ సొంతం చేసుకుంది.

2023లో సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల ఆటగాళ్లు 81 బౌండరీలు కొట్టారు..

2022లో సోఫియా వేదికగా బల్గేరియా, సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 71 బౌండరీలు నమోదయ్యాయి..

2024 హైదరాబాద్ వేదికగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 70 బౌండరీలు నమోదయ్యాయి..

2022 సోఫియా వేదికగా బల్గేరియా వర్సెస్ సెర్బియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 69 బౌండరీలు నమోదయ్యాయి.

2017లో జోహాన్నెస్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 68 బౌండరీలు నమోదయ్యాయి.

మిగతా రికార్డులను పరిశీలిస్తే..

బంగ్లా పై టీమిండియా 22 సిక్స్ లు కొట్టగా.. ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు బాదిన జాబితాలో ఇది మూడో స్థానంలో ఉంది. మన రికార్డుల ప్రకారం చూసుకుంటే ఇది తొలి స్థానం లో ఉంది..

7.1 ఓవర్లలోనే భారత్ వేగంగా 100 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు కూడా భారత్ పైనే ఉంది. గతంలో 7.6 ఓవర్లలోనే భారత్ ఈ ఘనతను సాధించింది.

టీమ్ ఇండియా తరఫున t20 లలో సెంచరీ కొట్టిన ఏకైక వికెట్ కీపర్ గా సంజు శాంసన్ నిలిచాడు. 2022లో శ్రీలంక జట్టు మీద ఈశాన్ కిషన్ చేసిన 89 పరుగులు ఇప్పటివరకు ఒక టీమ్ ఇండియా వికెట్ కీపర్ చేసిన హైయెస్ట్ స్కోర్ గా ఉంది.

బంగ్లా పై 200 స్కోర్ మార్క్ చేరుకునేందుకు భారత్ 14 ఓవర్ల పాటు ఆడింది. రికార్డు ఇంతకుముందు 13.5 ఓవర్ల తో సౌత్ ఆఫ్రికా పేరుపై ఉంది.

టీమిండియా బ్యాటర్లు బంగ్లా పై 22 సిక్స్ లు, 25 ఫోర్లు కొట్టారు. మొత్తంగా 232 రన్స్ చేశారు. స్థూలంగా 47 బౌండరీలతో.. అత్యధిక బౌండరీల జాబితాలోనూ భారత్ ఇన్నింగ్స్ మొదటి స్థానంలో నిలిచింది.

స్వదేశంలో వరుసగా 16 సిరీస్ విజయాలతో భారత్ విజయయాత్ర కొనసాగిస్తోంది. 2019 నుంచి భారత్ స్వదేశంలో ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.

బంగ్లా పై జరిగిన మ్యాచ్లో 18 ఓవర్ల పాటు భారత్ పదికి పైగా రన్ రేట్ తో పరుగులు సాధించింది.

బంగ్లా పై ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టిన సంజు సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్లో ఐదు అంతకంటే ఎక్కువ సిక్సులు కొట్టిన రెండవ బ్యాటర్ గా నిలిచాడు. సంజు కంటే ముందు యువరాజ్ సింగ్ 6 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

బంగ్లా పై జరిగిన మ్యాచ్లో భారత్ పవర్ ప్లే లో 82/1 పరుగులు చేసింది. అంతకుముందు 82/2 పరుగులు చేసి సెకండ్ టాప్ కూడా భారత జట్టే కావడం విశేషం.

ఈ మ్యాచ్లో 297/6 పరులు చేసిన టీమిండియా టి20 ఫార్మాట్ లో.. సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. అయితే టెస్ట్ హోదా ఉన్న జట్లలో భారత్ దే తొలి స్థానం.