Team India T20 Biggest Wins : మూడు టీ – 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ పై వైట్ వాష్ విజయాన్ని సాధించింది. 3-0 తేడాతో టి20 సిరీస్ ను దక్కించుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడవ టి20 లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 297 రన్స్ చేసింది. అనంతరం టార్గెట్ చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన బంగ్లాదేశ్… 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి ఏడు వికెట్ల కోల్పోయి 164 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో టీం ఇండియా 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా సాధించిన భారీ విజయాలను ఒకసారి పరిశీలిస్తే..
పరుగులపరంగా..
2023లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 168 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2018లో డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 143 రన్స్ తేడాతో విజయం సాధించింది.
2024లో బంగ్లాదేశ్ జట్టుతో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో 133 రన్స్ తేడాతో భారత్ విజయం సాధించింది.
2023లో జోహన్నెస్ బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన ఓ మ్యాచ్లో భారత్ 106 రన్స్ తేడా తో విజయం సాధించింది.
2022లో దుబాయ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2024లో హరారే వేదికగా జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఉగాండా తర్వాత..
ఇక ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టి20 విజయాలు సాధించిన జట్లలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఉగాండా 29 విజయాలతో మొదటి స్థానంలో ఉంది. 2023లో ఉగాండా జట్టు 29 విజయాలు దక్కించుకుంది.
2022లో భారత్ 28 విజయాలు సాధించి రెండవ స్థానంలో కొనసాగుతోంది.
ఇక ప్రస్తుత ఏడాదిలో భారత్ 21 విజయాలు సాధించింది. 2022లో టాంజానియా 21 విజయాలు సాధించింది.
2021 లో పాకిస్తాన్ జట్టు 20 విజయాలు సాధించింది..
2024లో భారత్ t20 లలో సాధించిన విజయాల శాతం ఒక క్యాలండర్ ఇయర్లో 12 t20 లు ఆడిన జట్లలో ఇది అత్యుత్తమమైన విజయ శాతం కావడం విశేషం.
అత్యధిక పరుగులు చేసిన జట్లపరంగా..
బంగ్లాదేశ్, భారత్ హైదరాబాద్ వేదికగా తలపడిన మూడవ టి20 మ్యాచ్లో 461 రన్స్ నమోదయ్యాయి. ముందుగా టీమిండియా 297 రన్స్ చేస్తే.. బంగ్లాదేశ్ 164 రన్స్ చేసింది. పరుగులపరంగా ఈ మ్యాచ్ రెండో స్థానంలో ఉంది.
దీనికంటే ముందు 2019లో డెహ్రాడూన్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 472 రన్స్ నమోదయ్యాయి.
2016లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ముంబై వేదికగా తలపడగా.. 459 రన్స్ చేశాయి.
ఇండియా సౌత్ ఆఫ్రికా, భారత్ 2022లో గౌహతి వేదికగా తలపడిన మ్యాచ్లో 458 రన్స్ చేశాయి.
2023లో గౌహతి వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా తలపడగా 457 పరుగులు చేశాయి.