https://oktelugu.com/

Zimbabwe vs India : ఇదేం బ్యాటింగ్ బాబోయ్.. చివరి 10 ఓవర్లలో ఇంత స్కోరా.. టీమ్ ఇండియా సరికొత్త రికార్డు

Zimbabwe vs India చివరి 10 ఓవర్లలో ఓవర్ కు 16 పరుగుల చొప్పున రాబట్టింది. ఏకంగా 160 పరుగులు పిండుకొని.. 234 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో ఏడు ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేశాడు. టి20 ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జింబాబ్వే టూర్ ద్వారానే అభిషేక్ శర్మ టీమిండియా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ శర్మ మస కద్జా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక రుతు రాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 77* పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రింకూ సింగ్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 48* పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2024 / 07:50 PM IST

    TEAM-INDIA-creates-history-SCORE

    Follow us on

    Zimbabwe vs India : తొలి టీ 20 మ్యాచ్లో జింబాబ్వే చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన టీమిండియా.. రెండో టి20 మ్యాచ్ లో పడి లేచిన కెరటం లాగా జోరందుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే బౌలింగ్ ను ఊచ కొత కోసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. పది పరుగులకే కెప్టెన్ గిల్(2) వికెట్ కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మకు, రుతు రాజ్ గైక్వాడ్ తోడయ్యాడు. వీరిద్దరూ జింబాబ్వే బౌలింగ్ ను తుత్తునీయలు చేశారు. బౌలర్ ఎవరనేది చూడకుండా వీర విహారం చేశారు. వాస్తవానికి పది ఓవర్లు ముగిసే నాటికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు మాత్రమే చేసింది. రుతు రాజ్ గైక్వాడ్ 29(26), అభిషేక్ శర్మ 41(30) పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నారు. ఇక ఆ తర్వాత టీమిండియా ఒక్కసారిగా గేర్ మార్చింది.

    చివరి 10 ఓవర్లలో ఓవర్ కు 16 పరుగుల చొప్పున రాబట్టింది. ఏకంగా 160 పరుగులు పిండుకొని.. 234 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో ఏడు ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 100 పరుగులు చేశాడు. టి20 ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జింబాబ్వే టూర్ ద్వారానే అభిషేక్ శర్మ టీమిండియా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ శర్మ మస కద్జా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక రుతు రాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 11 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో 77* పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రింకూ సింగ్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 48* పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

    చివరి 10 ఓవర్లలో 160 పరుగులు చేయడం ద్వారా టీమ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐసీసీ టి20 ఇంటర్నేషనల్ క్రికెట్లో చివరి 10 ఓవర్లలో ఓవర్ కు 16 పరుగుల చొప్పున టీమిండియా 160 పరుగులు చేసింది. టి20 ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇదే హైయెస్ట్ రికార్డ్ గా ఉంది. టీమిండియా తర్వాత శ్రీలంక రెండవ స్థానంలో కొనసాగుతోంది. 2007 జోహన్నెస్ బర్గ్ లో కెన్యా జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 159 పరుగులు చేసి, ఈ ఘనత సాధించింది. 2019లో డెహ్రాడూన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి 10 లో 156 పరుగులు చేసింది. 2020లో మౌంట్ మగునాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ పై న్యూజిలాండ్ చివరి 10 ఓవర్లలో 154 పరుగులు చేసింది.. అంతేకాదు జింబాబ్వే పై t20 లలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా జట్టుపై ఉండేది. 2018 లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.