India Vs Australia World Cup Final: ఇండియా ఆస్ట్రేలియా తో ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతుంది.ఇక ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపు కోసం ఒక అకుంటిత దీక్షతో పోరాటం చేస్తూ గెలుపే లక్ష్యంగా చివరి ఊపిరి వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునే ఛాన్సే లేదు అంటూ రోహిత్ సేన తన కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తుంది. ఇక ఇలాంటి సమయంలో ఇండియన్ టీం ను ఓడించే సత్తా ఆస్ట్రేలియన్ టీమ్ కు ఉందా అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. గత మ్యాచ్ లను చూసుకుంటే ఆస్ట్రేలియా ఇండియాని ఓడించడంలో చాలా వెనుకబడిపోయింది. వరల్డ్ కప్ కి ముందు ఆడిన మూడు వన్డేల సిరీసుల్లో ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా పైన తన ఆధిపత్యాన్ని చూపిస్తూ రెండు వన్డేల్లో గెలిచి ఒక దాంట్లో ఓడిపోవడం జరిగింది.
ఇక ఈ టోర్నీ లో కూడా లీగ్ దశలో ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియాని ఓడించి ఘన విజయం సాధించింది… దీనివల్ల ఇప్పుడు ఇండియానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ఇది ఫైనల్ మ్యాచ్ కావడం వల్ల గత మ్యాచ్ విషయాలను పక్కన పెడితే ఈ ఒక్క మ్యాచ్ ఎలా ఆడుతున్నామనేదే ఇక్కడ ప్రధానమైన అంశంగా మారబోతుంది. అందులో భాగంగానే ఆస్ట్రేలియా టీం ని ఓడించే సత్తా ఇండియన్ టీమ్ కు ఉంది అనడానికి కొన్ని కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…
ఇండియా టీం వరుసగా పది విజయాలను సాధించి ఈ టోర్నీలో అత్యధిక విజయాలను సాధించిన టీం గా ముందు వరుసలో ఉంది. ఇక ఆస్ట్రేలియా టీమ్ మొదటి రెండు మ్యాచ్ ల్లో దారుణంగా ఓడిపోయినప్పటికీ త్వరగా కంబ్యాక్ ఇచ్చి వరుస విజయాలను అందుకుంటూ వరుసగా 8 విజయాలను నమోదు చేసుకుంది. అయితే లీగ్ లో ఆస్ట్రేలియా ఇండియా మీద ఓడిపోవడమే ఇప్పుడు మైనస్ అయింది. దాంతోనే ఈ మ్యాచ్ పట్ల అభిమానుల్లో ఆస్ట్రేలియా కంటే ఇండియా మీదనే ఎక్కువ హోప్స్ పెరుగుతున్నాయి. ఇక దానికి తోడుగా ఇండియాలో ఉన్న 11 మంది ప్లేయర్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇండియా టీం ఉన్నంత స్ట్రాంగ్ గా ఆస్ట్రేలియన్ ప్లేయర్లు లేరు కాబట్టి ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ని మన స్పిన్నర్లు కుప్ప కూల్చే అవకాశం అయితే ఉంది… ఈ ఒక్క కారణం చాలు ఇండియన్ టీం గెలవడానికి…ఇక ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ విషయానికి వస్తె ఆ విషయం లో ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది.ఆస్ట్రేలియన్ బౌలర్లని ఈజీగా ఎదుర్కొని ఎంత భారీ స్కోరైనా సరే చేయగలమనేంత కాన్ఫిడెంట్ గా ఇండియన్ టీమ్ ప్లేయర్లు గత మ్యాచ్ ల్లో ప్రూవ్ చేసుకున్నారు…
ఇక ఆస్ట్రేలియా టీం మిడిల్ ఆర్డర్ లో స్టీవ్ స్మిత్, లబుషణ్ లాంటి ప్లేయర్లను మన స్పిన్నర్లు అయిన రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లు ఈజీగా కట్టడం చేస్తారు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ రెండు కారణాల వల్లనే ఇండియా ఆస్ట్రేలియా మీద విజయం సాధించబోతుంది అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది…