Odi World Cup 2023: శ్రీలంక మీద గెలిస్తే డైరెక్ట్ సెమీస్ కి టీమిండియా… మిగతా జట్ల పరిస్థితి ఏంటంటే..?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి ఈ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. ఇక ఇక్కడ ఇంతకుముందు జరిగిన చాలా మ్యాచుల్లో పరుగుల వరద పారిందనే చెప్పాలి ఈ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్స్ ఎక్కువగా విజృంభించి ఆడే అవకాశాలు ఉన్నాయి.

Written By: Gopi, Updated On : November 2, 2023 10:08 am

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా శ్రీలంక జట్ల మధ్య ఒక భారీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తే అధికారికంగా సెమీ ఫైనల్ కి చేరుకుంటుంది.ఇక దానితోపాటుగా వరుసగా ఏడు విజయాలను నమోదు చేసి ఈ టోర్నీలో చరిత్రను క్రియేట్ చేస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో శ్రీలంక టీం కూడా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో 2 విజయాలను మాత్రమే నమోదు చేసి చాలా ఘోరమైన పర్ఫామెన్స్ ఇస్తు పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంక టీం ఇండియన్ టీమ్ ని ఓడించడం అంటే అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోతే మాత్రం శ్రీలంక టీం ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు పాయింట్స్ టేబుల్ లో చివరి వరుసలో ఉన్న పాకిస్తాన్ టీమ్ బంగ్లాదేశ్ మీద భారీ విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 5 పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక ఇలాంటి క్రమంలో మొదటి 5 జట్ల మధ్య సెమీస్ పోటీ నడుస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోతే శ్రీలంక ఇంటికి పోవడం అనేది కన్ఫామ్ అవుతుంది.

ఇక ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి ఈ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. ఇక ఇక్కడ ఇంతకుముందు జరిగిన చాలా మ్యాచుల్లో పరుగుల వరద పారిందనే చెప్పాలి ఈ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్స్ ఎక్కువగా విజృంభించి ఆడే అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా విరాట్ కోహ్లీ కి ఇక్కడ చాలా మంచి రికార్డ్ ఉంది కాబట్టి ఆయన ఈ మ్యాచ్ లో తన 49 వ సెంచరీ చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…ఇక దాని తగ్గట్టుగానే ఈ మ్యాచ్ లో బౌలర్లు కొంతమేరకు కట్టడి చేస్తే బ్యాట్స్ మెన్స్ కొద్ది వరకు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇది బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్ కావడం వల్ల బ్యాట్స్ మెన్స్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది.

కొద్ది ఓవర్లు గడిచిన తర్వాత పేసర్లకు కూడా పిచ్ చాలా వరకు అనుకూలిస్తుందని తెలుస్తుంది. అయితే హార్దిక్ పాండ్యా టీంలో లేకపోవడం వల్ల ఇంతకుముందు ఇంగ్లాండ్ మీద ఏ టీం తో అయితే బరిలోకి దిగిందో ఇండియా అదే టీం తో ప్రస్తుతం బరిలోకి దిగాలని చూస్తుంది. నిజానికి ఇంగ్లాండ్ మీద జరిగిన మ్యాచ్ లో ఇండియా వరుస వికెట్లను కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి క్రమంలో సూర్య కుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేసి టీమ్ కి గౌరవప్రదమైన స్కోర్ ని అందించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే టీమ్ లో నెంబర్ 8 పొజిషన్ వరకు కూడా బ్యాట్స్ మెన్స్ ఉండే విధంగా రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడు. ఇంక శ్రీలంక తో ఆడుతున్న ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ పెద్దగా వ్యూహాలు ఏమి లేకుండా బరిలోకి దిగుతుంది.ఎందుకంటే రీసెంట్ గా శ్రీలంక టీం ని ఏషియా కప్ లో ఇండియా దారుణంగా ఓడించడం జరిగింది.

అలాగే ఏషియా కప్ ఫైనల్ లో అయితే శ్రీలంక టీమ్ ని 50 పరుగులకు అలౌట్ చేసి ఇండియా ఒక అద్భుతమైన రికార్డును కూడా క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి టైం లో శ్రీలంక టీమ్ ని ఇప్పుడు మళ్లీ ఓడించడం ఇండియా కి పెద్ద కష్టమైతే కాదు…ఇక ఈ మ్యాచ్ లో భారీ విజయాన్ని సాధించి ఇండియా అఫీషియల్ గా ఈ టోర్నీ లో సెమీస్ కి వెళ్లిన మొదటి టీముగా గుర్తింపు పొందడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంది. చూడాలి మరి ఇండియా శ్రీలంక టీం ని ఏ విధంగా ఓడిస్తుందో…