Odi World Cup 2023: ప్రస్తుతం వరల్డ్ కప్ లో అన్ని టీమ్ లు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ వరుస ఓటమిలతో చతికిల పడిపోయింది.ఇక అఫ్గాన్, నెదర్లాండ్స్ లాంటి టీంలు కూడా సెమీస్ రేస్ లో మిగిత జట్ల కి పోటీ ఇస్తున్నాయి.అందులో భాగంగానే ప్రతి టీమ్ ఆడే ప్రతి మ్యాచ్ కూడా గెలవాలనే ఉద్దేశ్యం తోనే బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక మొదట ఏ జట్టు అయిన ఒక్క మ్యాచ్ ఓడిపోయిన కూడా ఇంటికి వెళ్లి పోవాల్సి ఉంటుంది.ఇక ఇప్పటివరకు ప్రతి టీమ్ ఎన్ని మ్యాచ్ లు ఆడింది ఎన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించింది.ఎన్ని మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఏ టీం కి ప్రస్తుతం సెమీస్ కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దాని మీద పూర్తి వివరాలు ఒకసారి మనం తెలుసుకుందాం…
సౌతాఫ్రికా
సౌతాఫ్రికా టీమ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది వరుసగా విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.ఇక రీసెంట్ గా న్యూజిలాండ్ మీద ఆడిన మ్యాచ్ లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్ మీద ఘన విజయం సాధించింది. దాంతో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడితే అందులో 6 మ్యాచ్ ల్లో గెలిచి 12 పాయింట్లను సాధించింది. ఇక తదుపరి మ్యాచ్ లుగా భారత్, అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది…ఇక పాయింట్స్ టేబుల్ లో ఇండియాని సెకండ్ పొజిషన్ కి నెట్టి సౌతాఫ్రికా మొదటి ప్లేస్ ని సొంతం చేసుకుంది…
ఇండియా
ఇండియన్ టీమ్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడితే అన్ని మ్యాచ్ ల్లో గెలిచి
వరల్డ్ కప్ లో ఒక అద్భుతమైన హిస్టరీ ని క్రియేట్ చేసింది.ఇక ప్రస్తుతం ఇండియన్ టీమ్ 12 పాయింట్లతో సెకండ్ పొజిషన్ లో ఉంది.ఇక ఇండియా వరుసగా శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక ఇలాంటి క్రమం లో ఇండియా మరో మ్యాచ్ గెల్చిన కూడా ఇండియా సెమీస్ కి చేరుకుంటుంది. అయితే ఇండియా ఇప్పుడున్న ఫామ్ కి ఇండియన్ టీమ్ ఒకటి కాదు వరుసగా ఆ మూడు మ్యాచ్ లు గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు…
ఆస్ట్రేలియా
భారీ అంచనాలతో వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా టీమ్ కి మొదట్లోనే భారీ దెబ్బ పడింది.మొదటి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి ఈ టోర్నీ ని ఒక ఫెయిల్యూర్ గా స్టార్ట్ చేసింది అయినప్పటికీ మళ్ళీ పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వరుస మ్యాచ్ లను గెలుస్తూ సెమీస్ రేస్ లో చాలా ముందుకు దూసుకు వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో ఉంది. ఇక వరుసగా ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.ఇక తను ఆడాల్సిన మూడు మ్యాచ్ ల్లో వరుసగా ఒకటి లేదా రెండు మ్యాచ్ ల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ఆడితే మంచి విజయాలను సాధించడం తో పాటు సెమీస్ బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటుంది…
న్యూజిలాండ్
న్యూజిలాండ్ టీమ్ ఈ టోర్నీ లో ఆరంభం నుంచి వరుసగా విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక వరుసగా 4 మ్యాచ్ లలో మంచి విజయం సాధించిన తర్వాత భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడి కాస్త వెనక పడిందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా సౌతాఫ్రికా మీద భారీ పరుగుల తేడా తో ఘోరం గా ఓడిపోవడం తో న్యూజిలాండ్ నెంబర్ 4 లో కొనసాగుతుంది.ఇక ఆ తర్వాత వరుసగా పాకిస్థాన్, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధిస్తే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్ టీమ్ లో ప్లేయర్లు అందరూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మ్యాచ్ లు ఓడిపోవాల్సి వస్తుంది…
పాకిస్థాన్
పాకిస్థాన్ ఈ టోర్నీ లో మొదటి రెండు మ్యాచ్ లు మంచి విజయాన్ని సాధించి మంచి శుభా రంభాన్ని ఇచ్చినప్పటికి ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.ఇక ఇప్పుడు 7 మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి 6 పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 5 పొజిషన్ లో కొనసాగుతుంది.ఇంకా పాకిస్థాన్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలవాలి….
అఫ్గానిస్థాన్
చిన్న జట్టు గా వచ్చి ఈ టోర్నీ లో అద్భుతాలు చేస్తుంది అఫ్గాన్ టీమ్…అఫ్గాన్ ఇప్పటి వరకు వరుసగా ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక టీమ్ లను ఓడించి వాళ్ళు ఏ టీమ్ కంటే తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకున్నారు…మిగతా మూడు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంది. సెమీస్ చేరాలంటే అఫ్గాన్ ఈ మూడు మ్యాచ్‌ల్లో నెగ్గాలి అలా గెలిస్తేనే ఈ టీమ్ ఎవరితో సంబంధం లేకుండా సెమీస్ కి అర్హత సాధిస్తుంది….
శ్రీలంక
ఒకప్పుడు వరుస విజయాలను అందుకుంటూ వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా ఉన్న శ్రీలంక టీమ్ ఇప్పుడు మాత్రం చాలా దారుణమైన పరిస్థితి లో ఉంది.ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. కేవలం నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న శ్రీలంక టీమ్ ఇప్పటికీ కూడా సెమీస్ రేసులో ఉంది. అయితే ఇవాళ్ళ ఇండియా మీద ఆడే మ్యాచ్ లో గెలిస్తే లంక టీమ్ సెమీస్ రేస్ లో ఉంటుంది లేకపోతే మాత్రం సెమీస్ రేస్ నుంచి తప్పుకుంటుంది…
నెదర్లాండ్స్..
నెదర్లాండ్స్ టీమ్ ఈ టోర్నీ లో అత్యంత స్ట్రాంగ్ టీమ్ అయిన సౌతాఫ్రికా టీమ్ ని ఓడించి తము ఎలాంటి టీమ్ కీ అయిన పోటీ ఇస్తాం అని ప్రూవ్ చేసుకున్నారు… ఇక నెదర్లాండ్స్ టీమ్ రెండు విజయాలను అందుకొని నాలుగు పాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 8 పొజిషన్ లో కొనసాగుతుంది.ఇక నెదర్లాండ్స్ టీమ్ వరుసగా అఫ్గానిస్థాన్ , ఇంగ్లాండ్, ఇండియా తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ల్లో విజయాలను సాధిస్తే నెదర్లాండ్స్ టీమ్ సెమీస్ కి చేరుకుంటుంది…
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ టీమ్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక్క విజయం మాత్రమే సాధించి ఈ టోర్నీ లో దారుణంగా ఫెయిల్ అయిందనే చెప్పాలి.ఇక దాంతో ఈ టోర్నీ నుంచి ఇంటికి వెళ్లిపోయే మొదటి టీమ్ కూడా బంగ్లాదేశ్ టీమ్ అనే చెప్పాలి…
ఇంగ్లాండ్
డిఫెండింగ్ చాంపియన్స్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీమ్ వరుసగా పరాజయాలను అందుకొని ఈ టోర్నీ లో చిట్ట చివరి వరుసలో ఉంది.ఇక ఇప్పటి వరకు ఇంగ్లాండ్ టీమ్ ఆరు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించి మిగిలిన ఐదు మ్యాచ్ ల్లో ఓడిపోయింది…ఒక వరుసగా ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్ టీమ్ ల మీద మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.ఈ మూడు మ్యాచ్ ల్లో గెలిచిన కూడా ఇంగ్లాండ్ టీమ్ సెమీస్ కి చేరుకోవడం కష్టం అనే చెప్పాలి…
ఇక వీటిని బట్టి చూస్తే ఇండియా ,సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లకి సెమీస్ అవకశాలు ఎక్కువ గా ఉన్నాయి…ఇవే నాలుగు టీంలు సెమీస్ లో తలపడనున్నట్టు గా తెలుస్తుంది…