Virat Kohli: విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఈ పరుగులు యంత్రం గురించి చెప్పడానికి ప్రత్యేకంగా కొలమానాలు(parameters) అవసరం లేదు. ఫామ్ లో ఉన్నా.. లేకున్నా.. అతని గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అది మీడియా కావచ్చు.. సోషల్ మీడియా కావచ్చు.. మొత్తానికి విరాట్ కోహ్లీ(Virat Kohli) నామస్మరణ యధావిధిగా జరిగిపోతూ ఉంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana chief minister revanth Reddy), మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రస్తావించారంటే అతని స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
బొమ్మ వెనక బొరుసు కూడా ఉన్నట్టు.. విరాట్ కోహ్లీ(Virat Kohli) మొన్నటిదాకా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తిరుగులేని ఆట తీరు ప్రదర్శించాడు. అలవోకగా సెంచరీలు చేశాడు. అత్యంత సులభంగా హాఫ్ సెంచరీలు బాదాడు. అటువంటి ఆటగాడు ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు. పైగా ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(border Gavaskar trophy)లో టీమిండియా(team India) దారుణమైన ఆట తీరు ప్రదర్శించడంతో.. సిరీస్ కోల్పోయింది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్(world latest champion finals) వెళ్లే అవకాశాలను కూడా నష్టపోయింది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఆట తీరు పూర్తిగా మార్చాలని.. జట్టులో సమూలంగా మార్పులు చేయాలని బీసీసీఐ(BCCI) భావించింది. ఇందులో భాగంగానే తెరపైకి పది పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధాన ప్రకారం ఆటగాళ్లు మొత్తం కచ్చితంగా రంజి ఆడాలి. కెప్టెన్ నుంచి టేలండర్ వరకు ప్రతి ఒక్కరు రంజీలలో తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. అందువల్లే రోహిత్ శర్మ(Rohit Sharma), గిల్(Gill), ఇతర ఆటగాళ్లు ముంబై తరఫున రంజి ఆడుతున్నాడు. టీమిండియాలో మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరఫున రంజి ఆడుతున్నాడు..
రైల్వేస్ తో 30న ప్రారంభం
సుదీర్ఘకాలం విరామానికి విరాట్ కోహ్లీ తెర దించాడు. ఢిల్లీ జట్టు తరఫున అతడు రంజీలోకి బరిలోకి దిగుతున్నాడు. వాస్తవానికి అతడు ఇటీవలే తొలి మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ.. మెడ నొప్పి వల్ల ఆడ లేకపోయాడు.. అయితే ఈ నెల 30న రైల్వేస్ (Railways)జట్టుతో ప్రారంభమయ్యే మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ క్రమంలో అతడు ఢిల్లీ రంజి జట్టు (Delhi Ranji team)లో అతడు చేరిపోయాడు.. ముంబై నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయిన విరాట్.. ఢిల్లీ రంజి జట్టులో భాగమయ్యాడు. అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley stadium) లో అతడు శిక్షణ ప్రారంభించాడు. గ్రూప్ రన్నింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్ లో పాలుపంచుకున్నాడు. ఢిల్లీ ఆటగాళ్లతో కలిసి ఫుట్ బాల్ కూడా ఆడాడు. కొంతకాలంగా విరాట్ కోహ్లీ బ్యాక్ ఫుట్, ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సంజయ్ బంగర్ ఆధ్వర్యంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.. ఇక సోమవారం కూడా ముంబైకి సమీపంలో ఉన్న ఆలీభాగ్ వద్ద విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేయడం విశేషం. సుదీర్ఘకాలం తర్వాత విరాట్ కోహ్లీ రంజి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో.. సోషల్ మీడియా మొత్తం అతడి ఫోటోలతో షేక్ అవుతుంది. మొత్తానికి షేర్ వచ్చాడని.. పూర్వపు ఫామ్ అందుకుంటాడని.. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందిస్తాడని అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.