Hari Hara Veeramallu
Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో అన్నిటికంటే ముందుగా విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. షూటింగ్ కార్యక్రమాలు 90 శాతం కి పైగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మార్చి 28వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై మంచి అంచనాలు పెంచాయి. రీసెంట్ గా విడుదలైన ‘మాట వినాలి’ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఈ పాటకు 28 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా 100 మిలియన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పాడిన ఫోక్ సాంగ్ ఇది. ఒకపక్క ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎంత బిజీ గా ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.
ఇలాంటి సమయంలో ఆయన షూటింగ్ కి డేట్స్ ఇవ్వడమే కష్టం గా ఉంటే, ఏకంగా పాట పాడేందుకు కూడా సమయం వెచ్చించడాన్ని చూస్తుంటే ఈ సినిమా పై ఆయనకీ ఎంత ఆసక్తి ఉందో తెలియచేస్తుంది. అయితే ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియో ని రిపబ్లిక్ డే రోజున విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ రేపు విడుదల చేయబోతున్నట్టు మూవీ టీం ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకొని ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో చాలా వైరల్ అయ్యింది. లుక్స్ పరంగా చూస్తే ఆయన పది సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్టుగా అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నారు. ఈ లుక్ ని చూసిన అభిమానులు బయట లుక్స్ కి, సినిమాలో లుక్స్ కి ఏమన్నా సంబంధం ఉందా?, ఇంత అందంగా ఉన్నారేంటి అంటి ఆశ్చర్యపోతున్నారు.
పవన్ కళ్యాణ్ లుక్స్ వారం వారంకి మారిపోతూ ఉంటాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఎంత స్మార్ట్ గా తయారయ్యాడో మనమంతా చూసాము. ఓజీ చిత్రం లుక్ లో ఆయన కనిపించాడు. త్వరలో ఓజీ మూవీ షూటింగ్ కూడా మొదలు కానుంది. ఆ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ లుక్స్ లో మార్పులు వచ్చాయని అంటున్నారు ఫ్యాన్స్. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి ఇంకా 7 రోజుల పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ బ్యాలన్స్ ఉన్నాయి. ఈ కాల్ షీట్స్ ఇచ్చేస్తే సినిమాకి సంబంధించి ఆయన పార్ట్ పూర్తి అవుతుంది. మార్చి 28 వ తారీఖున చిత్రం కచ్చితంగా విడుదల అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ డేట్స్ ఎప్పుడిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో ఫిబ్రవరి రెండవ వారం వరకు ఆయన డేట్స్ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు.