BJP strategy
AP Politics : జగన్ ( Jagan Mohan Reddy) పని అయిపోయిందా? జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? జగన్ జైలుకెళ్లడం ఖాయమా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ కేసుల విషయంలో రోజువారి విచారణ జరగాలన్న కోర్టు ఆదేశాలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. మున్ముందు ఈ పరిణామాలు జగన్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టడం ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. ప్రత్యక్షంగా జగన్ ను దెబ్బతీయడం అంత సులువు కాదు. అందుకే సాంకేతికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది బిజెపి. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఎలాను ఉంటుంది. అందుకే వచ్చే రెండు సంవత్సరాల్లో జగన్ కేసుల విషయంలో ఇబ్బంది పడడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా కేసుల్లో జగన్ కు రెండేళ్లపాటు జైలు జీవితం తప్పదన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో నడుస్తోంది.
* అది అంత సులువు కాదు
ఏపీ రాజకీయాల నుంచి జగన్ ను( Jagan Mohan Reddy) తప్పించడం అంత సులువు కాదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వైసిపి ఒక పునాది వేసుకుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి మంచి ఫలితాలు సాధించింది. కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అలాగని వైసిపి పూర్తిగా కనుమరుగు కాలేదు. ఓటు శాతం అమాంతం పడిపోలేదు. ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోయినా ఆ పార్టీకి 40 శాతం ఓటింగ్ వచ్చింది. ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకే జగన్ పతనం శాసించడం బిజెపి తరం కూడా కాదు. ప్రత్యక్షంగా ఢీ కొట్టాలంటే కుదిరే పని కూడా కాదు. ఆ విషయం తెలిసే బిజెపి కొత్త రూట్ వెతికింది. కేసుల రూపంలో జగన్ ను దెబ్బతీయాలని చూస్తోంది.
* గణనీయమైన ఓట్లు
గెలుపోటములతో వైసిపికి ( YSR Congress )నష్టం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి రాగలిగింది వైసిపి. అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైసిపి ఓడిపోయింది. కానీ ఏకంగా 40 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే అత్యధికంగా 51%, అత్యల్పంగా 40% ఓటింగ్ ఆ పార్టీకి ఉందన్నమాట. 10% ఓటింగ్ ఉన్న పార్టీలే మనుగడ సాధించగలుస్తుంది లేనిది.. ఏకంగా 40% ఓట్లు వచ్చిన పార్టీని ప్రత్యక్షంగా నిర్వీర్యం చేయడం ఎంత మాత్రం కుదరదు. ఆ విషయం బిజెపి పెద్దలకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు జగన్ కేసులపై పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న నిర్ణయానికి వచ్చారు.
* కేసులు మరింత వేగవంతం
జగన్ కేసులను మరింత వేగవంతం చేసి.. శిక్ష పడేలా చేయాలన్నది ఒక వ్యూహంగా తెలుస్తోంది. అప్పటివరకు వైసీపీని ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తారు. ఆ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతారు. ఆ విధంగా వైసీపీకి నష్టం కలుగుతుంది. క్షేత్రస్థాయిలో బలం తగ్గించగలుగుతారు. ఇంతలో జగన్ పై కేసులు తుది విచారణకు వస్తాయి. జగన్ పై నమోదైన కేసులకు సంబంధించి రెండేళ్ల పాటు జైలు శిక్ష పడితే.. ఆయన ఎన్నికల్లో పోటీకి అనర్హుడు అవుతారు. అయితే దీనిపై ఆయన మిగతా కోర్టులో సవాల్ చేసే పరిస్థితి ఉంది. కానీ దానికి కొంత సమయం పడుతుంది. ఇంతలో వచ్చే ఎన్నికలు దాటి పోతాయి కూడా. బిజెపి అలా ప్లాన్ చేసిందన్నమాట. చంద్రబాబుతో పాటు పవన్ వ్యూహము అదే అన్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.