Team India Ready For first T20 Against England: టీమిండియా ప్రస్తుతం కష్టాల్లో ఉంది. ఫామ్ కొనసాగించలేకపోతోంది. ఫలితంగా గెలవాల్సిన మ్యాచుల్లో అపజయమే పలకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ఏ మేరకు విజయం సాధిస్తారో తెలియడం లేదు. గురువారం నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య టీ 20 మ్యాచులు జరగనున్నాయి. ఇందులో రెండు జట్లు తమ ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నాయి. టెస్ట్ ఫలితం డ్రా కావడంతో ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా ఇంగ్లండ్ ను మట్టి కరిపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా కారణంగా జట్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచులకు అందుబాటులో ఉండనున్నాడు. కానీ బుమ్రా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లకు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్ మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరి గైర్హాజరుతో కొత్త వారికి అవకాశాలు దక్కనున్నట్లు చెబుతున్నారు. వీరు రెండో టీ20 మ్యాచ్ కు అందుబాటులోకి రానున్నారని సమాచారం. టీమిండియా ఆటగాళ్లలో ఫామ్ కోసం ఆరాటపడేవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి భవితవ్యం వారు ఆడే ఇన్నింగ్స్ పైనే ఆధారపడి ఉంది.
Also Read: L B Sriram: హిట్లర్ సినిమా ఎల్బీ శ్రీరామ్ కెరీర్ ను అడ్డుకుందా?
దీపక్ హుడా, సూర్యకుమార్ లాంటి వారు తమ స్థానం సుస్థిరం చేసుకోవాలంటే పరుగులు రాబట్టుకోవాలి. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితే తప్ప టీమిండియాలో చోటు పదిలం కాదని తెలిసినా ఆటలో తడబడుతున్నారు. దీంతో వారి భవిష్యత్ పై సందేహాలే వస్తున్నాయి. వారి ఎంపిక కోసం యాజమాన్యం మొగ్గు చూపాలంటే వారిలోని ప్రతిభను వెలికి తీసి మంచి ఫామ్ ను కొనసాగించేందుకు సిద్ధం కావాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఆటగాళ్లు ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియాలో త్వరలో జరిగే టీ 20 ప్రపంచ కప్ లో సత్తా చాటాలంటే ఇప్పటి నుంచే ఫామ్ కొనసాగించాలి. ఇంగ్లండ్ కూడా ప్రమాదకర స్థితిలో ఉండటంతో టీమిండియా మరింత కష్టపడాల్సి వస్తోంది. దీంతో ఇవాళ ప్రారంభమయ్యే టీ 20 మ్యాచులో సత్తా చాటాలని ఇరు జట్లు అనుకుంటున్నాయి. దీంతో ఎవరి కోరిక తీరుతుందో? ఎవరి ప్రయత్నాలు వృథా అవుతాయో తెలియడం లేదు. ఈ సందర్భంలో ఇంగ్లండ్ ను కట్టడి చేసేందుకు ప్రత్యేక వ్యూహం రచించేందుకు ఇండియా రెడీ ఉందని తెలుస్తోంది.
Also Read: MS Dhoni Love Story: ధోని-సాక్షి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా?