Reasons Behind Modi South Tour: తన స్కూటర్ వెనుక కూర్చుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్న నరేంద్ర మోడీ ఇంతటి వ్యక్తి అవుతాడని శంకర్ సింగ్ వాఘెలా ఆరోజు అనుకుని ఉండరు. తనకు కాఫీ కలిపి ఇచ్చి అణకువ గా ఉన్న మోదీ ఈరోజు దేశాన్ని శాసిస్తాడని కేశుభాయ్ పటేల్ కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మోడీ వెలుగుతున్న తీరు వారికే కాదు ఆయనతోపాటు రాజకీయాలు చేసిన వ్యక్తులకు కూడా అర్థం కావడం లేదు. ఎస్.. మోదీ ఎవరికీ అర్థం కాని, మింగుడు పడని క్యారెక్టర్. మొన్నటి దాకా ఉత్తరాది పార్టీని రెండు మార్లు అధికారంలోకి తెచ్చిన నాయకుడు అనే పేరు మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకుని నేను ఆడా ఉంట.. ఇడా ఉంట అనే తీరుగా దక్షిణాదిలో చక్రం తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. అంతేకాదు అందులో అడుగడుగునా దక్షిణ భారతాన్ని ప్రతిబింబించారు. వంటకాల్లో కూడా ఉత్తరాదివి కాకుండా దక్షిణాది వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏకంగా మోదీ తెలుగులో మాట్లాడి సభికులను ఉత్సాహ పరిచారు.
…
ప్రాంతీయ పార్టీలను దెబ్బ కొట్టేందుకు
..
దక్షిణాదిలో కర్ణాటకను కలుపుకుని మొత్తం 19 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. అయినప్పటికీ మోదీ కాంక్ష నెరవేరలేదు. ఇందుకు కారణం దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటమే. దీనివల్ల మోదీ అనుకున్న పాచికలు ఏవీ పాడడం లేదు. పైగా ఈ మధ్య తమిళనాడు, తెలంగాణ లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు మోదీని ధిక్కరిస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వేదిక మీద ఉన్న మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కడిగి పారేశారు. పైగా కేంద్రం తీసుకొచ్చిన నీట్ పరీక్ష ను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ కు మోడీ రావటంతో టీఆర్ఎస్ పార్టీ చేసిన రచ్చ అంత ఇంతా కాదు. ఏకంగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బిజెపి నాయకులకు చుక్కలు చూపింది. దీనికి తోడు మోదీ సమావేశం ఒకరోజు ముందు ఉండగానే ప్రతిపక్షాల పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమాన్ని భారీ అట్టహాసంగా చేసింది. ఆ తర్వాత ఏపీలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్ళినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అక్కడి నాయకులు నిరసన తెలిపారు. ఇవి సద్దుమణిగే లోపే డీఎంకే నేత రాజా తమిళనాడును ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కళ్ళ ముందు ఇన్ని పరిణామాలు జరుగుతా ఉంటే మోడీ చూస్తూ ఎలా ఊరుకుంటాడు? అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించారు.
…
దక్షిణాది వారికి అగ్ర తాంబూలం
..
ఎలాగైనా కర్ణాటకలో అధికారాన్ని సుస్థిరం చేసుకుని దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో జెండా ఎగరయాలని మోదీ షా దృఢ నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగానే ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లను దక్షిణాదిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులకు కేటాయించారు. ఇందులో కూడా రాష్ట్రాల ప్రాధాన్యతను గుర్తించి సీట్లు కేటాయించారు. కేరళ నుంచి పీటీ ఉష, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, తమిళనాడు నుంచి ఇళయరాజా, ఉమ్మడి ఏపీ నుంచి విజయేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేశారు. ఈ నలుగురూ వారి వారి రంగాల్లో అపార ప్రతిభ చూపిన వారే. వీరు వల్ల పార్టీని మరింత విస్తృతం చేయవచ్చని మోదీ షా భావిస్తున్నారు. గతంలో ఇళయరాజా మోదీ ని పొగిడిన విషయం విధితమే. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం మోదీకి కొరకరాని కొయ్యగా మారింది. దీంతో ఆ స్టాలిన్ కు చెక్ పెట్టేందుకు మోదీ ఇళయరాజాను
అస్త్రంగా ఎంచుకున్నారు. పీటీ ఉష, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్డే నియామకం కూడా అలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు లేకపోలేదు.
Also Read: Team India Ready For first T20 Against England: ఇంగ్లండ్ తో తొలి టీ20 పోరుకు టీమిండియా సిద్ధం.. ఇరు జట్ల బలాబలాలివీ!
..
ప్రయోజనం ఉంటుందా?
…
నీట్ రద్దు చేయాలని తమిళనాడు కోరుతోంది. విభజన హామీలు నెరవేర్చాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. ఆర్థిక తోడ్పాటు కల్పించాలని కేరళ విన్నవిస్తోంది. పైగా అయా రాష్ట్ర ప్రభుత్వాలు మోదీ దే తప్పు అంతా అన్నట్టు ప్రొజెక్టు చేస్తుండటంతో పార్టీ అంతలా ఎదగలేకపోతోంది. పైగా ఇక్కడి స్థానిక నాయకత్వం విషయానికి వస్తే తెలంగాణ, తమిళనాడు మినహా మిగతా రాష్ట్రాల్లో అంతంత మాత్రం పని తీరు చూపుతున్నది. ఈ క్రమం తన దక్షిణ కలలను సాకారం చేసేందుకు మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. 2020లో చైనా అధ్యక్షుడి తో తంజావూరు లో పర్యటించారు. ఆ సమయంలో తమిళ సంస్కృతి ప్రతిబింబించేలా పంచ కట్టుకున్నారు. ఆ తర్వాత మూడు సార్లు తెలంగాణకు వచ్చారు. ఏపీలో పర్యటించారు. కేరళలో కలియదిరిగారు. ఇన్ని చేస్తున్నారంటే ఒకే ఒక్క కారణం దక్షిణాది లో పాగా వేయడం. ఆ దిశగానే మోదీ బలంగా అడుగులు వేస్తున్నారు.
Also Read: CM Jagan- YCP Plenary: ఎన్నికలపై సీఎం జగన్ ప్రకటన.. సెంటిమెంట్ కంటిన్యూ చేస్తారా?