L B Sriram: తెలుగు సినిమాల్లో ఎల్బీ శ్రీరామ్ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. రచయితగానే కాకుండా నటుడిగా రాణించి తన ప్రతిభకు పదును పెడుతున్నాడు. సినిమా సినిమాకి వైవిధ్యం ప్రదర్శిస్తూ తనలోని నటుడిని బయటపెడుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. హలో బ్రదర్, ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు వంటి సినిమాలకు మాటలు రాసిన ఘనత ఆయన సొంతం. దీంతో డైలాగుల్లో కూడా గమ్మత్తైన మాటలు వాడుతూ తిరుగులేదని నిరూపించుకున్నారు.
మొదట నాటకాలు, తరువాత రేడియో అటు పిమ్మట సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. కిష్కిందకాండ సినిమాకు కథను కూడా అందించారు. హిట్లర్ సినిమాకు మాటల రచయితగా పని చేశారు. తరువాత ఆయనకు మాటల రచయితకు అవకాశాలు దక్కకపోవడంతో అక్కడి నుంచి నటుడిగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తన డైలాగ్ వెర్షన్ లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు.
Also Read: Director Parasuram: మహేష్ కి సూపర్ హిట్ ఇచ్చినా కూడా ఆఫర్స్ దక్కించుకోలేకపోతున్న స్టార్ డైరెక్టర్
చిరంజీవి నటించిన హిట్లర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. హిట్లర్ విజయం తరువాత ఎల్ బీ శ్రీరామ్ కు అవకాశాలు వస్తాయని భావించినా రాలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. హిట్లర్ సినిమాలో చిరంజీవికి తక్కువ డైలాగులు ఉండటంతోనే ఆయనకు అవకాశాలు రాలేదని తెలుస్తోంది. మొత్తానికి హిట్లర్ సినిమా అందరికి మంచి ఫలితాలు ఇచ్చినా ఎల్బీ శ్రీరామ్ కు మాత్రం నెగెటివ్ ఫలితాన్ని ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎల్బీ శ్రీరామ్ తన కెరీర్ లో మాటల రచయితగానే ప్రయాణం కొనసాగించాలని భావించినా హిట్లర్ సినిమా ఆయన పాలిట విలన్ గా మారింది. దీంతో తరువాత కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుకే పరిమితమయ్యారు. తన కలానికి పని చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇదేదో బాగుందని ఆర్టిస్టుగానే సినిమాల్లో రాణిస్తున్నారు. హిట్లర్ సినిమా ఎల్బీ శ్రీరామ్ ను రచయిత నుంచి ఆర్టిస్టుగా మలచడంలో ప్రధాన భూమిక పోషించిందని చెబుతున్నారు.