Team India : ఎట్టకేలకు టీమిండియా ఆటగాళ్లకు విముక్తి

Team India : టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ 125 కోట్ల ప్రోత్సాహక బహుమతి అందించింది. జట్టులోని మొత్తం 15 మంది సభ్యులకు తలా 5 కోట్ల చొప్పున ఈ నగదును పంచుతారు. రిజర్వ్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సభ్యులకు తలా కోటి రూపాయలు ఇస్తారు.

Written By: NARESH, Updated On : July 3, 2024 6:49 pm

Team India players for India as Barbados typhoon recedes

Follow us on

Team India : టి20 ప్రపంచ కప్ ముగిసింది. టీమిండియా విజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. వాస్తవానికి ఆదివారం ఉదయమే టీమిండియా స్వదేశానికి బయలుదేరాల్సి ఉంది. అయితే వానాకాలం కావడంతో కరేబియన్ దీవులలో హరికేన్ ఏర్పడింది. ఫలితంగా గత కొద్దిరోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడిన బార్బడోస్ లోనూ విపరీతమైన వర్షాలు కురిసాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటి సరఫరా కూడా అస్తవ్యస్తంగా మారింది. విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో విమానాశ్రయాలలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఫలితంగా భారత క్రికెటర్లు అక్కడే చిక్కుకుపోయారు. హోటల్ గదులకే పరిమితమైపోయారు. చివరకు బీసీసీఐ చార్టర్ట్ విమానాలను వెస్టిండీస్ పంపి.. టీమిండియా ఆటగాళ్లను స్వదేశానికి తీసుకురావాలని భావించింది. అయితే వాతావరణంలో ప్రతికూలత వల్ల అది సాధ్యం కాలేదు.

వర్షం వల్ల భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ, వివిధ క్రికెటర్ల కుటుంబ సభ్యులు మొత్తం 70 మంది దాకా హోటల్ గదులకే పరిమితమైపోయారు. వర్షాలు ఎంతకీ తగ్గకపోవడంతో టీమిండియా ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులలో సహనం నశించింది టీమిండియా ఆటగాళ్లు బస చేసిన బార్బడోస్ రాజధాని బ్రిడ్జి టౌన్ లో చిక్కుకుపోయిన భారత్ క్రికెట్ బృందం ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడా మీదుగా ప్రత్యేక విమానంలో భారత్ కు తిరుగు ప్రయాణమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ మీదుగా టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి రానున్నారు.. తుఫాన్ వల్ల విమాన సర్వీసులు రద్దు కావడంతో.. బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రత్యేక చొరవ తీసుకొని విమానాన్ని ఏర్పాటు చేశారు.

ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక విమానం భారత క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, జట్టు సహాయక సిబ్బంది, బీసీసీఐ కార్యవర్గ సభ్యులు, భారతీయ క్రీడా పాత్రికేయులు ఈ విమానంలో రానున్నారు. ఇది మన సర్వీస్ కు ఎయిర్ “ఇండియా ఛాంపియన్స్ 24 ప్రపంచ కప్” అని నామకరణం చేసింది. బ్రిడ్జ్ టౌన్ నుంచి అమెరికాలోని న్యూ జెర్సీ మీదుగా ఈ ప్రత్యేక విమానం న్యూఢిల్లీ రానుంది. సుమారు 16 గంటల ప్రయాణం తర్వాత భారత జట్టు ఆటగాళ్లు గురువారం ఉదయం 6 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటారు గురువారం ఉదయం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ క్రికెటర్లను సత్కరిస్తారు. ఆ తర్వాత భారత జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది ఢిల్లీ నుంచి వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోతారు. టి20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ 125 కోట్ల ప్రోత్సాహక బహుమతి అందించింది. జట్టులోని మొత్తం 15 మంది సభ్యులకు తలా 5 కోట్ల చొప్పున ఈ నగదును పంచుతారు. రిజర్వ్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, సహాయక సభ్యులకు తలా కోటి రూపాయలు ఇస్తారు.