Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు(Mahesh Babu)… తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ప్రస్తుతం ఆయన రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పలు రికార్డులను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు. ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అలాంటిది ఏకంగా పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడు. ఇక ప్రస్తుతానికైతే మహేష్ బాబుకు భారీగా మార్కెట్ అయితే ఏమీ లేదు.రాజమౌళి ని చూసే ఈ సినిమాకి భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది సినిమా ఎన్ని వందల కోట్ల వరకు వసూళ్లను రాబడుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి సినిమా అంటే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి.
ఇక ఆయన సినిమాలో హీరో ఒక యోధుడిగా కనిపిస్తాడు. భారీ కటౌట్ తో పెద్ద పెద్ద ఫైట్లను చేయగలిగే కెపాసిటీ ఉన్న హీరోగా కనిపిస్తారు. మరి అలాంటి స్టైల్ లోనే మహేష్ బాబు ని కూడా చూపిస్తున్నాడా? మరి మహేష్ బాబు ఒక యోధుడిలా కనిపించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని…
ఎందుకంటే ఆయన చాలా అందంగా చాలా సింపుల్ గా ఉంటాడు. కాబట్టి ఆయన్ని యోధుడు అని చెప్పిన కూడా ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఒక ప్రిన్స్ లా చూపిస్తే మాత్రం నమ్ముతారు… అంతే తప్ప భారీగా ఏలివేట్ చేస్తు యోధుడిలా కనిపించడం లో మహేష్ బాబు కొంచెం వీక్…కాబట్టి రాజమౌళి అతన్ని ఎలా డీల్ చేస్తున్నాడు.
మహేష్ తో తెరమీద ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతుంది. ఇక ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపగలిగితే మాత్రం రాజమౌళి 3000 కోట్ల కలెక్షన్లను కొల్లగొడతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక దంగల్ (Dangal) సినిమా రికార్డును ఎవరు బ్రేక్ చేయడం లేదంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ రాజమౌళి ఈ సినిమాని విజువల్ వండర్ గా తెరకెక్కించి అలవోకగా 3000 కోట్ల కలెక్షన్లను కొల్లగొడతాననే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు…