Ind vs Pak : ఎప్పుడెప్పుడ అని ప్రపంచం మొత్తం ఎదురుచూసిన మ్యాచ్ ఎట్టకేలకు ఇవాళ్ళ జరిగింది.ఇక ఇవాళ్ళ జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు చాలావరకు అద్బుతం గా బౌలింగ్ చేస్తూ మన టీమ్ యొక్క బౌలింగ్ డిపార్ట్ మెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మరోసారి ప్రూవ్ చేశారు. అసలు బ్యాటింగ్ కి ఎక్కువ గా అనుకూలించే ఈ నరేంద్ర మోడీ స్టేడియం లో మన ఇండియన్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి అద్భుతమే చేశారు.నిజానికి ఇక్కడ రెండు టీములు కూడా భారీ పరుగులు చేస్తాయి అని అందరూ అనుకున్నారు.కానీ ఇక్కడ అందరికీ షాక్ ఇస్తు ఇండియన్ బౌలర్లు మ్యాచ్ ని వన్ సైడ్ చేసేసారు…నిజానికి ఈ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్లు అందరూ కూడా వాళ్ల స్థాయి మేరకు బౌలింగ్ వేస్తూ పాకిస్థాన్ బౌలర్లను ఇబ్బంది పెడుతూ వచ్చారు.
ముఖ్యం గా సిరజ్, బుమ్రా ఇద్దరు కూడా వాళ్ల బౌలింగ్ లోని స్వింగ్ తో పాకిస్థాన్ బౌలర్ లను కన్ ఫ్యుజ్ చేశారు. ఇక ఈ మ్యాచ్ లో మొత్తం ఇండియన్ బౌలర్ల మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోలేని పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా మహమ్మద్ రీజ్వన్ క్రీజ్ లో పాతుకు పోయి ఉన్నాడు. ఇక ఈయన ఔట్ అవ్వడం కష్టం అనుకున్న టైమ్ లో బుమ్రా వేసిన ఆ కటర్ మాత్రం మ్యాచ్ కి హైలెట్ అనే చెప్పాలి. అది రిజ్వనే కాదు అసలు ఎవరు ఊహించలేదు అలా స్వింగ్ అయి బౌల్డ్ అవుతుందని బాల్ తో అలాంటి అద్బుతం చేశాడు బుమ్రా…ఇక ఇండియన్ బౌలర్లు మన టీమ్ సత్తా ఏంటో మరోసారి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ కి చూపించారు. ఇక ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేసే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కి సైతం ఈ విజయం గుణపాఠం అనే చెప్పాలి…
ఇక ఇవాళ్టి మ్యాచ్ లో రోహిత్ కూడా ఒక అద్భుతమైన ఇన్నిగ్స్ ఆడి ఆయన ఇండియన్ టీమ్ విజయం లో కీలక పాత్ర వహించాడు.నిజానికి ఈయన ఆడిన ఆట లోని స్టైల్ ని చూస్తే చాలా రోజుల తర్వాత మనం ఒకప్పటి రోహిత్ శర్మ ని చూసాం అనే ఫీలింగ్ అయితే కలిగింది…నిజానికి ఈయన ఆడిన ప్రతి షాట్ కూడా చాలా ఆలవోక గా ఆడుతూ అసలు ఏ మాత్రం ప్రెజర్ లేకుండా కూల్ గా ఆడటం చూసిన ప్రతి ఒక ఆడియెన్ కూడా చాలా రోజుల తర్వాత ఒక వింటెజ్ రోహిత్ ని చూసాం.అని కామెంట్లు చేస్తున్నారు…ఇక ఈ విజయం తో పాయింట్స్ టేబుల్ లో ఇండియా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది…