Ind Vs Nz 2nd Test: ఆల్ టైం రికార్డు సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్ హిస్టరీ లోనే ఇదే తొలిసారి..

పూణే వేదికగా న్యూజిలాండ్ - భారత జట్లు రెండవ టెస్టు ఆడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. 259 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 25, 2024 8:21 am

Ind Vs Nz 2nd Test(5)

Follow us on

Ind Vs Nz 2nd Test: భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టును ప్రారంభంలోనే అశ్విన్ దెబ్బ కొట్టాడు. కెప్టెన్ లాతం (15) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్ (18) ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. ఈ క్రమంలో కాన్వే, రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అశ్విన్ మరోసారి రెచ్చిపోవడంతో కాన్వే అవుట్ అయ్యాడు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్ కు రోహిత్ బంతిని అందించాడు. ఆ తరువాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. స్పిన్ కు సహకరిస్తున్న మైదానం పై వాషింగ్టన్ సుందర్ బంతిని మెలికలు తిప్పాడు. మిగతా ఏడు వికెట్లను తన ఖాతా లో వేసుకున్నాడు. తను సాధించిన ఏడు వికెట్ల లో ఐదు బౌల్డ్ చేయడం విశేషం. బంతిని తనదైన శైలిలో మెలికలు తిప్పిస్తూ న్యూజిలాండ్ బ్యాటర్లను వాషింగ్టన్ సుందర్ తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. కాగా, వాషింగ్టన్ సుందర్ – రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్ జట్టు పది వికెట్లు తీసి అరుదైన రికార్డులను సృష్టించారు. ఒక టెస్ట్ ఇన్నింగ్స్ లో అన్ని వికెట్లను సాధించిన కుడి చేతివాటం ఆఫ్ స్పిన్నర్ల జోడీగా సుందర్ – అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

92 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో..

92 సంవత్సరాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లను కుడిచేతం వాటం ఆఫ్ స్పిన్ బౌలర్లు పడగొట్టలేదు. ఈ అత్యంత అద్భుతమైన ఘనతను సుందర్ – అశ్విన్ సృష్టించారు.. ఇక భారత గడ్డపై తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ లో పదవి వికెట్లను స్పిన్ బౌలర్లు పడగొట్టడం ఇది ఆరవసారి. దీనికంటే ముందు భారత జట్టు నాలుగు సార్లు ఈ ఘనతను సాధించింది. ఇంగ్లాండ్ ఒకసారి మాత్రమే చేయగలిగింది.. ఈ ఏడాది ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టుకు చెందిన స్క్రీన్ బౌలర్లు ఒకేరోజు 10 వికెట్లను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 1973లో ఇంగ్లాండ్ జట్టుపై, 1964లో ఆస్ట్రేలియాపై, 1956 లో ఆస్ట్రేలియా పై భారత స్క్రీన్ బౌలర్లు తొలిరోజు 10 వికెట్లను పడగొట్టారు. ఇక 1952లో భారత జట్టుపై ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. కాగా, సుందర్ దాటికి న్యూజిలాండ్ జట్టు 62 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లను కోల్పోవడం విశేషం.