Team India : టి20 వరల్డ్ కప్ గెలిచినా.. టీమిండియా కు ఏంటి ఈ కష్టాలు? చివరికి జై షా వల్ల కూడా కావడం లేదు..

Team India : మరోవైపు అక్కడ గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చార్టర్డ్ విమానాలు నడపడం అంత సులభం కాదని విమానయాన రంగ నిపుణులు చెప్తున్నారు.

Written By: NARESH, Updated On : July 3, 2024 10:41 am

Team India Cricketers

Follow us on

Team India :  టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి పొట్టి ప్రపంచ కప్ ను దక్కించుకుంది. అయితే టీమ్ ఇండియా గెలిచిన తర్వాత వాస్తవ షెడ్యూల్ ప్రకారం ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం తెల్లవారుజామున స్వదేశానికి తిరిగి రావాలి. కానీ ఇంతవరకు టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి రాలేదు.

టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ఆడింది. ఆ ప్రాంతం కరేబియన్ దీవుల్లో ఉంటుంది. ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో వర్షాకాలం మొదలైంది. అక్కడ ప్రతిరోజు విస్తారంగా వర్షం కురుస్తోంది. ఇటీవల అక్కడ తుఫాన్ ఏర్పడింది. దీంతో విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. వరద నీరు విమానాశ్రయాలను ముంచెత్తుతోంది. వర్షాలు తగ్గితేనే విమానాశ్రయాలు తెరుస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు..

టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఈ తుఫాన్ కారణంగా అక్కడే ఉండాల్సి వస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ తన ఆటగాళ్లను ఈ తుఫాన్ ప్రభావం నుంచి బయట పడేసేందుకు అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. చార్టర్డ్ ఫ్లైట్ ల ద్వారా ఆటగాళ్లను ఇండియాకు రప్పించేందుకు జై షా ప్రణాళిక రూపొందించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. సోమవారం బార్బడోస్ కు చార్టర్డ్ ఫ్లైట్ బయలుదేరేందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ.. వర్షం వల్ల బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే ఏ క్షణమైనా వాతావరణం అనుకూలిస్తే చార్టర్డ్ విమానాలను బార్బడోస్ పంపించేందుకు బిసిసిఐ సిద్ధంగా ఉంది. ఇప్పటికే చార్టర్డ్ విమానాలు నడిపే కంపెనీలతో ఎప్పటికప్పుడు బీసీసీఐ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ వాతావరణం అనుకూలించి వర్షం తగ్గితే.. విమానాశ్రయం తెరిచిన వెంటనే.. టీమిండియా బృందం అమెరికా లేదా యూరప్ వెళుతుందని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం టీమ్ ఇండియా బార్బడోస్ ను వదిలి వెళ్ళడం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అక్కడ వర్షాలు తగ్గు ముఖం పట్టడం లేదు. పైగా తుఫాన్ తీవ్రత వల్ల వర్షాలు విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం అయిపోయారు. మరోవైపు అక్కడ గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చార్టర్డ్ విమానాలు నడపడం అంత సులభం కాదని విమానయాన రంగ నిపుణులు చెప్తున్నారు.