Bhimavaram: 9 నెలల క్రితం మిస్సైన విజయవాడ అమ్మాయి.. జమ్మూలో ప్రత్యక్షం.. పవన్ ఛేదించిన అమ్మాయి కథ!

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్.. కార్యాలయ ప్రాంగణంలోనే జూన్ 22న ప్రజా దర్బార్ నిర్వహించారు. భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ పవన్ ను ఆశ్రయించింది.

Written By: Dharma, Updated On : July 3, 2024 10:57 am

Bhimavaram

Follow us on

Bhimavaram: తొమ్మిది నెలల కిందట ఒక యువతి అదృశ్యం అయింది. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ 9 నెలలుగా కేసులో ఎటువంటి పురోగతి లేదు. కానీ ఒకే ఒక్క ఆదేశంతో పది రోజుల్లో మిస్టరీ వీడింది. యువతి జాడ తెలిసింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఈ స్టోరీ. ఇంతకీ ఆదేశాలు ఇచ్చింది ఎవరో తెలుసా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 9 నెలలు సాధ్యం కాలేని పని.. కేవలం 10 రోజుల్లో సాధ్యం కావడం విశేషం. విజయవాడలో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్.. కార్యాలయ ప్రాంగణంలోనే జూన్ 22న ప్రజా దర్బార్ నిర్వహించారు. భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ పవన్ ను ఆశ్రయించింది. తన కుమార్తె ఆచూకీ 9 నెలలుగా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే స్పందించారు పవన్. మాచవరం సిఐ గుణ రాముకు ఫోన్ చేసి మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి యువతి ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. దీంతో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. చివరకు జమ్ములో ఆ యువతి జాడను కనిపెట్టారు పోలీసులు. స్వస్థలానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్ రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్ తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతోంది. అదే కళాశాల సీనియర్ విద్యార్థి, విజయవాడ శివారు నిడమానూరుకు చెందిన అంజద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్విని లోబరుచుకున్నాడు. గత ఏడాది అక్టోబర్ 28న రాత్రి వీరిద్దరూ హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బులు లేక ఫోన్లు, నగలు అమ్మేశారు. తరువాత కేరళ, ముంబై, ఢిల్లీలో తిరుగుతూ జమ్మూకు చేరారు. అక్కడే హోటల్లో అంజాద్ పనికి కుదిరాడు. ఇతరులతో మాట్లాడేందుకు తేజస్వినికి ఫోన్ ఇచ్చేవాడు కాదు. ఓ రోజు అంజాద్లేని సమయంలో అతని ఫోన్ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. ఈ చిన్న ఆధారం ద్వారా వివరాలు రాబట్టిన పోలీసులు వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. చిరునామాను అక్కడి పోలీసులకు పంపించారు. వారు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తీసుకువచ్చారు. ఈరోజు మధ్యాహ్నం విమానంలో విజయవాడ వారిని తీసుకురానున్నారు. బాధితులు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.