Pushpa 2: The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ మరో వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇలా అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ఆడియన్స్ అంతలా అన్ని భాషలకు సంబంధించిన ఆడియన్స్ ఆ స్థాయిలో ఎదురు చూసేలా చేస్తున్న చిత్రం ఇదే. ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. సాధారణ ప్రేక్షకులతో పాటు, సినీ సెలెబ్రిటీలు కూడా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్ కు వాళ్ళ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 2 మిలియన్ డాలర్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. అదే విధంగా లండన్ లో ఇప్పటికే 30 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే కేవలం ఓవర్సీస్ నుండే 7 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిర్మాతలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అదే విధంగా స్పెషల్ షోస్, బెన్ఫిట్ షోస్, అదనపు షోస్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అనుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
తెలంగాణ లో అనుమతి దాదాపుగా వచ్చేసినట్టే. రేపు, లేదా ఎల్లుండి లోపు జీవో ని విడుదల చేసే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండే అనుమతి రావాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్ ఇంతకు ముందు వచ్చిన పెద్ద సినిమాల కంటే ఒక 150 రూపాయిలు ఎక్కువ ఉండేలా మూడు రోజులకు అనుమతిని ఇవ్వాలని, ఆ తర్వాత ఇంతకు ముందు పెద్ద సినిమాలకు ఉన్న రేట్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారట. తెలంగాణ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంది కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కంట్రోల్ లోనే సినిమాటోగ్రఫీ శాఖ ఉంది. ఆయన ఒప్పుకుంటేనే పుష్ప 2 మేకర్స్ కోరినవన్ని వస్తాయి. మరి ఇటీవల పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఈ సినిమాకి కోరినంత టికెట్ రేట్ కి అనుమతిని ఇస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవేళ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతిని ఇస్తే ఈ ఆదివారం నుండే బుకింగ్స్ మొదలు అవ్వుధి. లేకపోతే మంగళవారం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.