https://oktelugu.com/

Allu Arjun : 27వ రోజు 3,00,000 టిక్కెట్ల అమ్మకం..దరిదాపుల్లో లేని కొత్త సినిమాలు..ఎంత వసూళ్లు వచ్చాయంటే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 ' చిత్రం విడుదలై 25 రోజులు పూర్తి అయ్యింది. ఈ 25 రోజులు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డులను చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : December 30, 2024 / 11:57 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం విడుదలై 25 రోజులు పూర్తి అయ్యింది. ఈ 25 రోజులు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన రికార్డులను చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. మొదటి రోజు నుండి ప్రతీ రోజు ఎదో ఒక ఆల్ టైం రికార్డు, ఎదో ఒక మైల్ స్టోన్ ని ఈ చిత్రం దాటుతూనే ఉంది. ఈ ఓటీటీ కాలంలో ఒక సినిమా రెండు వారాలు ఆడడమే అద్భుతం అని అనుకుంటే, ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా 25 రోజులు కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన మొట్టమొదటి చిత్రం గా పుష్ప 2 సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే విధంగా వరల్డ్ వైడ్ గా రోజు వారే గ్రాస్ వసూళ్లు డబుల్ డిజిట్ కి తక్కువ లేకుండా ఉంది.

    రీసెంట్ గా అన్ని ఇండస్ట్రీస్ లోనూ స్టార్ హీరోల కొత్త సినిమాలు విడుదలయ్యాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 డామినేషన్ కి అవి తట్టుకోలేకపోయాయి. నిన్న బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి ఏకంగా మూడు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మిగిలిన కొత్త సినిమాలకు ఇందులో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 25 రోజులకు గానూ బుక్ మై షో యాప్ లో 6 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘బాహుబలి 2 ‘ చిత్రానికి పది కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పుష్ప 2 వసూళ్ల పరంగా బాహుబలి 2 ని దాటేసింది కానీ, టికెట్స్ సేల్స్ విషయం లో మాత్రం దాటలేకపోయిందని చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా 25 వ రోజు ఈ చిత్రం వసూళ్ల పరంగా ఎంత రాబట్టిందో ఒకసారి చూద్దాము.

    తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 25 రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. హిందీ వెర్షన్ వసూళ్ల విషయానికి వస్తే నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 25 వ రోజు 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా 25 రోజులకు కలిపి 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే వరకు ఈ సినిమాకి థియేట్రికల్ రన్ ఉంటుంది. అప్పటి లోపు మరో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఓవరాల్ గా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందా లేదా అనేది చూడాలి.