ఆశలు అడియాశలయ్యాయి.. ఉన్న ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది.. మన సామర్థ్యం పక్కనబెట్టి ఇతర జట్టు గెలవాలని చేసిన పూజలు ఫలించలేదు. మొత్తంగా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే వరల్డ్ కప్ 20 నుంచి టీం ఇండియా ఇంటిబాట పట్టింది. టీ20 చరిత్రలోనే టీంఇండియా ఇలా సూపర్ 12 నుంచి ఇంటిబాట పట్టడం మొదటిసారి. 2007లో ప్రపంచ కప్ గెలిచిన తరువాత 2009, 2010, 2012లో సూపర్ 8 వరు వెళ్లింది. 2014లో రన్నరప్ వరకు వెళ్లింది. 2016లో సెమీఫైనల్ వరకు పోరాడింది. కానీ 20121 మాత్రం సూపర్ 12 నుంచి నిష్క్రమించడం భారతీయ క్రీడాకారులకు మింగుడుపడడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనన వ్యక్తం చేస్తున్నారు. రకరకాల పోస్టులు, మీమ్స తో రచ్చ చేస్తున్నారు.
ఆదివారం జరిగిన అప్ఘనిస్తాన్, న్యూజిల్యాండ్ మ్యాచులో కివీస్ గెలవగానే సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘ఇండియన్స్’, ‘ఇండియన్ ఫ్యాన్స్’ అంటూ ట్యాగులు పెట్టి పోస్టు చేశారు. ప్రతి ఒక్క భారతీయుడు టీం ఇండియా ఆటగాళ్లకు వార్నింగ్ ఇస్తున్నట్లు ఓ సీరియల్ వీడియోను తయారు చేసి ట్విట్టర్లో పోస్టు చేశారు. అలాగే ముంబయ ఎయిర్ పోర్టు పేరును ‘సెమీ ఫైనల్’గా మార్చేశారు. ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్టు ‘సెమీ ఫైనల్’గా పేరు మార్చుకుందని వ్యంగ్యంగా పోస్టు చేశారు. ఎక్కువగా కోహ్లిని టార్గెట్ చేసి పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
‘వరల్డ్ కప్ 20లో ఇండియా ఆడిన రెండు మ్యాచులు ఆదివారం జరిగాయి. తాజాగా అప్ఘినిస్తాన్ పై ఆశ పెట్టుకున్న మ్యాచు కూడా ఆదివారమే జరిగింది. దీంతో ఇండియాకు ఆదివారం కలిసి రాలేదంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఒక ఆదివారం పాకిస్తాన్ తో ఓడిపోగా.. మరో ఆదివారం న్యూజిలాండ్ తో పరాజయం చెందింది. ఈ ఆదివారం ఈ మ్యాచ్ ఆడకపోయినా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు.
టీంఇండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ సైతం ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ పరిస్థితి ఇది అంటూ రాహుల్ గాంధీ ఫొటోపెట్టి దానిపై ఖతం..ఖతం.. అంటూ కామెంట్ పెట్టారు. మరో వ్యక్తి ‘కళ్లకు ఐపీఎల్ అద్దాలు తీసి ప్రపంచకప్ అద్దాలు పెట్టుకోండి..’ అని పెట్టారు. మాజీ క్రికెట్ వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేసి ‘ఐసీసీ టీ 20లో భారత్ సెమీస్ కు చేరలేదు. ఇది టీం ఇండియాను బాగా బాధపెడుతోంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే కప్ కోసమైనా కసరత్తులు చేయలి’ అని కామెంట్ చేశారు.