https://oktelugu.com/

T20 World Cup : మీరెప్పుడైనా గమనించారా.. టి20 వరల్డ్ కప్ క్రికెట్ లో ఎంతకీ కొరుకుడు పడని నిజమిది..

T20 World Cup : 2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి మొన్నటి టోర్నీ దాకా.. ఆతిథ్య దేశాలు ఒక్కసారి కూడా దక్కించుకోకపోవడం క్రికెట్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : July 6, 2024 / 09:52 PM IST

    T20 World Cup History

    Follow us on

    T20 World Cup History : సాధారణంగా ఏదైనా క్రికెట్ టోర్నీని ఒక దేశంలో నిర్వహిస్తే.. కచ్చితంగా ఆ జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది.. గతంలో దీని నిరూపించే సంఘటనలు చాలా జరిగాయి. కానీ టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది.. వాస్తవానికి ఒకసారి జరిగితే.. అద్భుతం అనొచ్చు.. రెండవసారి జరిగితే ఆశ్చర్యమనొచ్చు.. 2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి మొన్నటి టోర్నీ దాకా.. ఆతిథ్య దేశాలు ఒక్కసారి కూడా దక్కించుకోకపోవడం క్రికెట్ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

    2007లో సౌత్ ఆఫ్రికా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. తొలి ఎడిషన్ లో ధోని ఆధ్వర్యంలోని టీమిండియా విజేతగా ఆవిర్భవించింది. వాస్తవానికి సొంత దేశంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ దక్షిణాఫ్రికా విజేతగా నిలవలేకపోయింది.

    2009లో ఇంగ్లాండ్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. వాస్తవానికి ఇంగ్లాండ్ విజేతగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పాకిస్తాన్ తొలిసారి విజేతగా ఆవిర్భవించింది.

    2010లో వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ తొలిసారిగా విజేతగా ఆవిర్భవించింది. వెస్టిండీస్ మైదానాలపై అద్భుతమైన విజయాలు సాధించి ఛాంపియన్ గా నిలిచింది.

    2012లో శ్రీలంక వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తొలిసారి విన్నర్ గా నిలిచింది. ఆసియా ఉపఖండ మైదానాలపై అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి విజేతగా ఆవిర్భవించింది.

    2014లో బంగ్లాదేశ్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో శ్రీలంక తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ – శ్రీలంక తలపడగా.. లంకేయులు విజయాన్ని సాధించారు.

    2016లో భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో వెస్టిండీస్ మరోసారి విజేతగా ఆవిర్భవించింది. రెండవసారి t20 వరల్డ్ కప్ దక్కించుకొని రికార్డు సృష్టించింది.

    2021లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాల వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తొలిసారి విజేతగా నిలిచింది.

    2022లో ఆస్ట్రేలియా వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తద్వారా రెండో సారి పొట్టి ప్రపంచ కప్ దక్కించుకొని, వెస్టిండీస్ సరసన నిలిచింది.

    2024లో అమెరికా – వెస్టిండీస్ వేదికలుగా టీ -20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీ లో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై 7 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి.. రెండోసారి విజేతగా ఆవిర్భవించింది. తద్వారా వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల సరసన నిలిచింది.