T20 World Cup 2026: మరికొద్ది నెలల్లో భారత్, శ్రీలంక వేదికలుగా టి20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు.. వాస్తవానికి ఈ టోర్నీ ప్రసార హక్కులు జియో హాట్ స్టార్ దక్కించుకుంది.. బీసీసీఐ నిర్వహించే ఐపిఎల్ నుంచి మొదలుపెడితే.. ఐసీసీ నిర్వహించే ఇతర టోర్నీల హక్కులను కూడా జియో హాట్ స్టార్ దక్కించుకుంది.. జియో హాట్ స్టార్ ద్వారా అటు బీసీసీఐ, ఇటు ఐసీసీకి భారీగానే ఆదాయం వస్తోంది.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల జియో హాట్ స్టార్ కీలక ప్రకటన చేసింది. ఇది కాస్త ఐసీసీ కి అనుకోని షాక్ ఇచ్చింది.
మరి కొద్ది రోజుల్లో శ్రీలంక, భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు.. ఈ టోర్నీ ప్రసార హక్కులను జియో హాట్ స్టార్ దక్కించుకుంది.. అయితే ఉన్నట్టుండి తాము బ్రాడ్ కాస్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటామని జియో హాట్ స్టార్ వర్గాలు ప్రకటించాయి. దీంతో ఐసీసీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి అయింది.. మరికొద్ది నెలలో ఈ మేజర్ టోర్నీ ప్రారంభం కావలసి ఉండగా.. ఇలా ప్రసార హక్కుల బాధ్యతల నుంచి జియో హాట్ స్టార్ తప్పుకోవడం ఐసీసీకి మింగుడు పడడం లేదు.
జియో హాట్ స్టార్ పక్కకు తప్పుకున్న నేపథ్యంలో.. అ బాధ్యతలను మరో పెద్ద బ్రాడ్ కాస్టర్ కు ఇవ్వాలని ఐసిసి భావిస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్, సోనీ నెట్వర్క్, నెట్ ఫ్లిక్స్ ను ఐసీసీ సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వీటిపై అధికారికంగా ఐసిసి క్లారిటీ ఇవ్వలేదు. ఉన్నట్టుండి జియో హాట్ స్టార్ వెళ్లిపోవడం వెనుక కారణాలు ఏమిటనేది నిన్నటి వరకు తెలియ రాలేదు.
స్పోర్ట్స్ వర్గాల నివేదిక ప్రకారం జియో హాట్ స్టార్ టి20 వరల్డ్ కప్ నుంచి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద భారత ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది..దీంతో డ్రీమ్ 11, ఫాంటసీ క్రికెట్ వంటి సంస్థలు మూతపడ్డాయి. జియో హాట్ స్టార్ కు ఈ సంస్థల నుంచే భారీగా ప్రకటనలు వస్తాయి. భారత ప్రభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మీద కఠిన వైఖరి అవలంబించడంతో ఆ రెండు సంస్థలు మూతపడ్డాయి. దీంతో జియో హాట్ స్టార్ కు ఆదాయం తగ్గిపోయింది. అందువల్లే ఆ సంస్థ టి20 వరల్డ్ కప్ ప్రసార హక్కుల బాధ్యతల నుంచి తప్పుకుంది.
BIG UPDATE ON ICC MEDIA RIGHTS
– The ICC has approached Sony Sports Network, Netflix & Amazon Prime to take over ICC’s media rights as JioStar seeks exit
– What’s the reason for JioStar Exit ? Some says – Virat and Rohit What’s your take pic.twitter.com/l0AhyhzS0Z
— Richard Kettleborough (@RichKettle07) December 9, 2025