Andhra King Talukaa Movie Collections: రామ్ పోతినేని(Ram Pothineni) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Talukaa Movie) థియేటర్స్ లోకి వచ్చి 13 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 13 రోజుల్లో ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆకర్షించే రేంజ్ వసూళ్లను ఒక్క రోజు కూడా రాబట్టలేకపోయింది. మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రామ్ కెరీర్ లో మరో నేను శైలజ లాంటి సైలెంట్ హిట్ గా నిలుస్తుందని అనుకుంటే, డిజాస్టర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేయడం ఆయన అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది. డిసెంబర్ 5న విడుదల అవ్వాల్సిన ‘అఖండ 2’ చిత్రం వాయిదా పడడం వల్ల, ఈ చిత్రానికి ఆ వీకెండ్ కాస్త కలిసొచ్చింది. అది కూడా భారీ రేంజ్ లో అయితే కాదు, గుడ్డిలో మెల్ల అనే విధంగా ఉంది. ఓవరాల్ గా 13 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఇలాంటి సినిమాలు బాగా ఆడుతాయి. కానీ ఈ చిత్రం అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ మార్కు కి దగ్గరకు రాలేకపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి 13 రోజుల్లో నైజాం ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఇక సీడెడ్ పరిస్థితి అయితే మరీ దారుణం. 13 రోజులకు కలిపి కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో 5 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి 13 రోజుల్లో 12 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి చూస్తే కేవలం కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట.
ఎక్కడ కలెక్షన్స్ వచ్చినా రాకపోయినా, ఓవర్సీస్ లో ఇలాంటి సినిమాలకు ఊహించని వసూళ్లు రావడం ఇది వరకు మనం చూస్తూ వచ్చాము. కానీ ఈ చిత్రానికి కేవలం 2 కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే హాఫ్ మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయట. కెరీర్ లో ఒక్క 1 మిలియన్ డాలర్ మార్క్ సినిమా లేకపోయినా, ఈ చిత్రం తో రామ్ ఆ క్లబ్ లోకి అడుగుపెడుతాడని అంతా ఆశించారు. కానీ తీరా చూస్తే ఈ చిత్రం కూడా టార్గెట్ మిస్ అయ్యింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 16 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 11 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అది దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు విశ్లేషకులు.