T20 World Cup 2024: సెమీస్ పోరులో క్రికెట్ కొత్త సెన్సేషన్ ఆఫ్ఘనిస్తాన్, మిగతా జట్ల బలాబలాలు ఇవే

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం ఇది ఐదవ సారి. 2007లో ఛాంపియన్ గా, 2014లో రన్నరప్ గా గెలిచింది.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీ ఫైనల్ వెళ్లడం ఇది తొలిసారి. ఇంగ్లాండ్ జట్టు రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 26, 2024 2:42 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో లీగ్, సూపర్ -8 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి.. నాలుగు జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. ఈ సెమీఫైనల్ లోకి టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్టు ప్రవేశించాయి. గ్రూప్ – 1 నుంచి టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ -2 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సెమీఫైనల్ వెళ్ళాయి.

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ వెళ్లడం ఇది ఐదవ సారి. 2007లో ఛాంపియన్ గా, 2014లో రన్నరప్ గా గెలిచింది.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీ ఫైనల్ వెళ్లడం ఇది తొలిసారి. ఇంగ్లాండ్ జట్టు రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు నాలుగో సారి సెమీఫైనల్ వెళ్ళింది. దక్షిణాఫ్రికా జట్టు 2014లో సెమీఫైనల్ ఆడింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు సెమీ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ -1 లో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ రెండో స్థానంలోకి కొనసాగుతోంది. ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ -2 లో రెండో స్థానంలో ఉండగా, సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది.

గ్రూప్ -1 లో రెండవ స్థానంలో ఉన్న జట్టు ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ -2 లో మొదటి స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జూన్ 27న ట్రిని డాడ్ వేదికగా జరుగుతుంది.. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. ఇక గ్రూప్ -1 లో మొదటి స్థానంలో నిలిచిన టీమిండియా, గ్రూప్ -2 లో రెండవ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్లు రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో తలపడతాయి. ఈ మ్యాచ్ జూన్ 27న భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతుంది ఈ మ్యాచ్ గయానా వేదికగా జరుగుతుంది. అంటే రెండు సెమి ఫైనల్ మ్యాచ్ లు ఒకే రోజు జరుగుతాయి.