Rohit Sharma: రోహిత్ బద్దలు కొడుతున్న ఈ రికార్డులు చూస్తే.. ప్రత్యర్థి కెప్టెన్లు బిత్తర పోవాల్సిందే..

రోహిత్ ఆస్థాయిలో జట్టును ముందుకు తీసుకెళ్లాడు కాబట్టి.. టి20 వరల్డ్ కప్ లో కూడా అతడినే కెప్టెన్ గా బీసీసీఐ కొనసాగించింది. పైగా అతడికి అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన రికార్డు ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 22, 2024 5:34 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. లీగ్ దశలో ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లను ఓడించింది భారత్.. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి ఉంటే.. అందులోనూ భారత్ గెలిచేదే. ఇక సూపర్ -8 పోరు లోనూ భారత్ విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో అన్ని రంగాలలో భారత్ పై చేయి సాధించి.. గెలుపును సొంతం చేసుకుంది. మొత్తంగా టి20 వరల్డ్ కప్ లో భారత్ నాలుగు విజయాలు సొంతం చేసుకుంది. గత ఏడాది స్వదేశం వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది.

రోహిత్ ఆస్థాయిలో జట్టును ముందుకు తీసుకెళ్లాడు కాబట్టి.. టి20 వరల్డ్ కప్ లో కూడా అతడినే కెప్టెన్ గా బీసీసీఐ కొనసాగించింది. పైగా అతడికి అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన రికార్డు ఉంది. టి20 ప్రపంచ కప్ లో రోహిత్ ఆధ్వర్యంలో భారత్ జట్టు పది మ్యాచ్లు ఆడింది.. ఇందులో ఎనిమిది మ్యాచ్లు టీమ్ ఇండియా గెలిచింది. రోహిత్ ఆధ్వర్యంలో విన్నింగ్ పర్సంటేజ్ ఏకంగా 80% గా ఉంది.

ఇక రోహిత్ నాయకత్వంలో టీమిండియా 58 t20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడింది. ఇందులో 45 మ్యాచ్లు గెలిచింది. 12 మ్యాచ్లలో ఓడిపోయింది. ఒకదాంట్లో ఫలితం రాలేదు. ఈ ఫార్మాట్లో రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 75.68 గా ఉంది.

రోహిత్ ఆధ్వర్యంలో భారత్ 55 వన్డేలు ఆడింది. ఇందులో 34 మ్యాచ్లు గెలిచింది, పది మ్యాచ్లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్లో ఫలితం రాలేదు. వన్డేలలో రోహిత్ గెలుపు శాతం 75.55 గా ఉంది.

రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు 16 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో పది మ్యాచ్లు గెలిచింది, నాలుగింట్లో ఓడింది.. రెండు డ్రా గా మారాయి. ఈ ఫార్మాట్లో రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 62.50 గా ఉంది.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ శర్మకు పేరు ఉంది. ముంబై జట్టుకు ఏకంగా ఐదుసార్లు కప్ అందించాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు 158 మ్యాచులు ఆడగా.. 87 విజయాలు సాధించింది. 67 మ్యాచ్లలో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్లు టై అయ్యాయి. విన్నింగ్ పర్సంటేజ్ 55.06 శాతంగా ఉంది.

రోహిత్ సారథ్యంలో భారత్ మొత్తంగా 119 మ్యాచులు ఆడింది. ఇందులో 89 గెలిచింది, మరో 29 మ్యాచులు ఓడింది. రెండు డ్రా కాగా, మరో రెండిట్లో ఫలితం రాలేదు. టీమిండియా కెప్టెన్ గా రోహిత్ విన్నింగ్ పర్సంటేజ్ 74.79% గా ఉంది.