T20 World Cup 2024: టీ -20 ల్లో టై.. సూపర్ ఓవర్లో ఫలితం..ఈ మ్యాచ్ లు ఎప్పటికీ ప్రత్యేకం

శ్రీలంక వేదిక 2012లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్కోర్లు సమం అయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 174 పరుగులు చేయగా.. అనంతరం చేజింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టూ ఏడు వికెట్ల కోల్పోయి 174 రన్స్ చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 7, 2024 12:06 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టీ -20 అంటేనే వేగానికి సిసలైన కొలమానం. దూకుడైన ఆట తీరుకు పర్యాయపదం. అలాంటి పొట్టి క్రికెట్ లో సంచలనాలకు నాంది పలికిన మ్యాచ్ లు చాలా ఉన్నాయి. ప్రేక్షకులను ముని వేళ్ళ మీద నిలబెట్టి.. ఉత్కంఠతో చూసేలా చేశాయి. టి20 వరల్డ్ కప్ లో భాగంగా డల్లాస్ వేదికగా అమెరికా, పాకిస్తాన్ తలపడిన మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఇందులో అమెరికా వీరోచితంగా పోరాడి ఐదు పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ప్రేక్షకులకు అసలు సిసలైన టి20 మజా అందించింది. అయితే దీనికంటే ముందు టి20 క్రికెట్ లో ఆ తరహా మ్యాచ్ లు చాలానే చోటుచేసుకున్నాయి ఇంతకీ అవి ఎప్పుడు? ఎక్కడ? ఎవరి మధ్య జరిగాయో? ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత్ vs పాకిస్తాన్, డర్బన్, 2007

2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభించిన సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 రన్స్ చేసింది. రాబిన్ ఊతప్ప 50, ధోని 33, ఇర్ఫాన్ పఠాన్ 20 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఆసిఫ్ 4, ఆఫ్రిది 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం పాక్ జట్టు చేజింగ్ ప్రారంభించగా.. మిస్బాబుల్ హక్ 53, షోయబ్ మాలిక్ 20 పరుగులతో ఆకట్టుకోవడంతో పాక్ 141 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అది బౌల్ ఔట్ కు దారి తీసింది. భారత్ 3-0 తేడాతో పాక్ పై విజయం సాధించింది.. టీ -20 క్రికెట్ చరిత్రలో ఇది ఉత్కంఠ మ్యాచ్ గా నిలిచిపోయింది.

న్యూజిలాండ్ vs శ్రీలంక, పల్లె కెలే, 2012

శ్రీలంక వేదిక 2012లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్కోర్లు సమం అయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఏడు వికెట్లకు 174 పరుగులు చేయగా.. అనంతరం చేజింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టూ ఏడు వికెట్ల కోల్పోయి 174 రన్స్ చేసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక ఒక వికెట్ కు13 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయి 7 పరుగులు మాత్రమే చేసింది. దీంతో శ్రీలంక విజయాన్ని దక్కించుకుంది .
న్యూజిలాండ్vs వెస్టిండీస్, పల్లెకెలే, 2012

శ్రీలంక వేదికగా 2012లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 139 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం లక్ష్య చేదన ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అనంతరం రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహించగా వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 19/0 తో నిలిచింది. న్యూజిలాండ్ 17/0 వద్ద ఆగిపోయింది. ఫలితంగా రెండు పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది.

ఒమన్, నమీబియా, బార్బడోస్, 2024

అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఒమన్, నమీబియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన నమీబియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ లో నమిబియా 21 పరుగులు చేయగా.. ఒమన్ ఒక వికెట్ కోల్పోయి పది పరుగులు చేసింది. సూపర్ ఓవర్ లో విజయం సాధించి నమీబియా సరి కొత్త రికార్డు సృష్టించింది.

అమెరికా vs పాకిస్తాన్, డల్లాస్, 2024

టి20 వరల్డ్ కప్ లో భాగంగా డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో అమెరికా, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన. పాకిస్తాన్ 159 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన అమెరికా కూడా 159 పరుగులు చేసింది. సూపర్ ఓవర్ లో అమెరికా 18 పరుగులు చేయగా.. పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి, 13 పరుగుల వద్ద నిలిచింది.. దీంతో అమెరికా సంచలన విజయం సాధించి.. సరికొత్త రికార్డు సృష్టించింది.