T20 World Cup 2024: జూన్ రెండవ తేదీన వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ – 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. న్యూజిలాండ్ ముందుగా తమ జట్టును ప్రకటించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, భారత్, ఆస్ట్రేలియా వరుసగా తమ ఆటగాళ్ల జాబితాను ఐసీసీకి పంపించాయి. ఈ జట్లలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ అన్నిటికంటే డేంజరస్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు ప్రకటించిన ఆటగాళ్లలో అందరూ అత్యంత ప్రతిభావంతులు. ప్రతి ఆటగాడు మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు కొట్ట గలడు. బంతులతో మాయ చేయగలడు. ఫీల్డింగ్ లోనూ అనితర సాధ్యమైన వేగంగా కదలగలడు. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై విశ్లేషకులకు అంచనాలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఉన్న జట్టును ఓడించడం ఇతర జట్లకు సాధ్యం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లుగా కెప్టెన్ బట్లర్, ఫిల్ సాల్ట్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఐపీఎల్లో వీరిద్దరూ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. మైదానంతో సంబంధం లేకుండా దూకుడుగా ఆడుతున్నారు. వన్ డౌన్ లో విల్ జాక్స్ సూపర్బ్ గా ఆడుతున్నాడు. ఇటీవల గుజరాత్ జట్టుపై జరిగిన మ్యాచ్లో బెంగళూరు తరఫున 31 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం పది బంతుల్లోనే వంద పరుగులకు చేరుకున్నాడు. మిడిల్ ఆర్డర్ లో జానీ బెయిర్ స్టో, హ్యరీ బ్రూక్, లివింగ్ స్టోన్ భీకరంగా ఆడుతున్నారు. వీరు కొద్దిసేపు క్రీజు లో ఉంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. లోయర్ ఆర్డర్లో ఆడే మొయిన్ అలీ, సామ్ కరణ్, ఆర్చర్ కూడా భీకరమైన షాట్లు కొట్టగలరు. పదో స్థానంలో వచ్చే అదిల్ రషీద్ కూడా బ్యాట్ తో సంచలనాలు సృష్టించగలడు.
ఈ ప్రకారం ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని ఉంచినప్పటికీ ఇంగ్లాండ్ ముందు.. నిశ్చింతగా ఉండే పరిస్థితి లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. బౌలింగ్ లో ఆ జట్టు బౌలర్లు బంతులు సంధించగలరు. అలాంటప్పుడు భారీ స్కోర్ చేసే అవకాశం ప్రత్యర్థి జట్టుకు ఉండదని వారు అంటున్నారు. అలాంటప్పుడు ఇంగ్లాండ్ జట్టును ఓడించడం అంత సులువు కాదని, బలమైన వ్యూహాలు అమలు చేస్తేనే అది సాధ్యమవుతుందని వివరిస్తున్నారు.
ఇంగ్లాండ్ జట్టు అంచనా
బట్లర్ (కెప్టెన్), లివింగ్ స్టోన్, సాల్ట్, జాక్స్, బ్రూక్, సామ్ కరణ్, ఆర్చర్, రషీద్, టోప్లే, మొయిన్ అలీ, బెన్ డకెట్, హార్ట్ లీ, జోర్డాన్, మార్క్ వుడ్, బెయిర్ స్టో.