Pushpa 2 First Song: పుష్ప 2 ఫస్ట్ సింగిల్ రివ్యూ… అల్లు అర్జున్ ఊరమాస్ జాతర, ఫ్యాన్స్ కి పూనకాలే!

దేవిశ్రీ మరోసారి అద్భుతమైన స్వరాలు ఇచ్చాడు. ఇక రచయిత చంద్రబోస్ మాస్ లిరిక్స్ తో అల్లు అర్జున్ పాత్రను ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు. తెలుగులో పుష్ప పుష్ప సాంగ్ ని నాకాష్ అజీజ్, దీపక్ బ్లూ పాడారు.

Written By: S Reddy, Updated On : May 1, 2024 5:40 pm

Pushpa 2 First Song

Follow us on

Pushpa 2 First Song: పుష్ప 2 విడుదలకు మరో మూడున్నర నెలల సమయం ఉంది. అప్పుడే ప్రమోషన్స్ మొదలెట్టేశారు. దీనిలో భాగంగా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ‘పుష్ప పుష్ప’ అనే ఈ లిరికల్ సాంగ్ పుష్ప 2లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తీరును గుర్తు చేసేలా ఉంది. ఆ పాత్ర నైజం, మేనరిజం లిరిక్స్ రూపంలో వెల్లడించాడు. నీ యవ్వా ఎవడికి తగ్గేదేలే… అని కూలీగా ఉన్నపుడే పుష్పరాజ్ అంటాడు. మరి డాన్ అయ్యాక అతడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్మగ్లింగ్ సామ్రాజ్యనికి కింగ్ గా ఎదిగిన పుష్ప రాజ్ నేచర్ ని ‘పుష్ప పుష్ప’ లిరికల్ సాంగ్ చెప్పకనే చెప్పింది.

దేవిశ్రీ మరోసారి అద్భుతమైన స్వరాలు ఇచ్చాడు. ఇక రచయిత చంద్రబోస్ మాస్ లిరిక్స్ తో అల్లు అర్జున్ పాత్రను ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు. తెలుగులో పుష్ప పుష్ప సాంగ్ ని నాకాష్ అజీజ్, దీపక్ బ్లూ పాడారు. మొత్తంగా పుష్ప 2 నుండి వచ్చిన మొదటి సాంగ్ అంచనాలు అందుకుంది. సినిమాపై హైప్ పెంచేసింది. అల్లు అర్జున్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తుంది.

పుష్ప 2 మొదటి భాగానికి మించి ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో కలుగజేసింది ఈ సాంగ్. పుష్ప 2 ఆగస్టు 15 వరల్డ్ వైడ్ 6 భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషలతో పాటు బెంగాలీలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. విడుదలకు ముందే పుష్ప 2 పేరిట అనేక రికార్డులు నమోదు అయ్యాయి. థియేట్రికల్, డిజిటల్ రైట్స్ కలుపుకుని పుష్ప దాదాపు రూ. 1000 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.

2021 లో విడుదలైన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది పుష్ప 2. పార్ట్ 1 వరల్డ్ వైడ్ రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈసారి పుష్ప హిందీ ఏకంగా రూ. 200 కోట్లకు అమ్ముడయ్యాయి. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్ చేస్తున్నాడు. అనిల్, అనసూయ, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.